Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

లింగ సమానత్వానికి సమియా పిలుపు

న్యూయార్క్‌ : ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోంది.. ఈ సంవత్సరం జనరల్‌అసెంబ్లీలో 13మంది మహిళలు మాట్లాడారు. గత సంవత్సరం 9మంది మాత్రమే ప్రసంగించారు. నా దేశ చరిత్రలో తొలి మహిళా అధ్యక్షురాలిగా లింగ సమానత్వాన్ని అందించే బాధ్యత నా భుజస్కందాలపై ఉంది అని టాంజానియా అధ్యక్షురాలు సమియా సులుహు హసన్‌ న్యూయార్క్‌లో జరిగిన ఐరాస ప్రధాన కార్యాలయంలో ప్రసంగించారు. మేము సాధించిన విజయాలను కోవిడ్‌19 వెనక్కు నెట్టేందుకు ప్రయత్నిస్తోంది. అయినా మేం థైర్యంగా ఎదుర్కొంటాం అని విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం ముగ్గురు ఉపాధ్యక్షులు, ఐదుగురు ప్రధానులుషేక్‌ హసీనా, న్యూజిలాండ్‌ అధ్యక్షురాలు జసిండా ప్రసంగించారు. ఎస్టోనియా అధ్యక్షుడు కెర్బి మాట్లాడుతూ సమాజంలో మహిళల దుర్బలత్వాన్ని గురించి నొక్కి చెప్పారు. మానవాళి జనాభాలో సగం మంది ఉన్న స్త్రీలు లేకుండా ప్రజాస్వామ్యం, భద్రత, అభివృద్ధి ఉండదన్నారు. యుఎన్‌ శాంతి పరరిక్షణ కార్యకలాపాలలో గ్లోబల్‌ వార్మింగ్‌ను కీలక భాగంగా మార్చాలని కోరారు. ఆఫ్రికాలోని సహెల్‌, సిరియా, ఇరాక్‌లు ఉదాహరణలుగా పేర్కొన్నారు. ఉదయం ప్లీనరీలో పలస్తీనా అధ్యక్షుడు మహమూద్‌అబ్బాస్‌, అర్మేనియా ప్రధాని ప్రసంగించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img