Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

వాక్సిన్లు అందరికీ సమంగా అందాలి

75 దేశాల విజ్ఞప్తి
ఐక్యరాజ్యసమితి: వాక్సిన్‌ ఈక్విటీ కోసం ఐరాస జనరల్‌ అసెంబ్లీలో చైనా సహా దాదాపు 75 ప్రపంచ దేశాల సంఫీుభావం కోసం పిలుపునిచ్చాయి. మెక్సికో, పాకిస్తాన్‌, దక్షిణాఫ్రికా సహా 75దేశాల తరఫున సంయుక్త ప్రకటన విడుదల చేసారు. ప్రతి మానవునికి జీవించే హక్కు, ఆరోగ్యహక్కు ఉన్నాయని దీనికి సంబంధించిన వాక్సిన్లను సరసమై ధరలకు పంపిణీని ప్రోత్సహించాలని ఐరాసలో చైనా రాయబారి జాంగ్‌ అన్ని దేశాలకు పిలుపునిచ్చారు. టీకా పంపిణీలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రాధాన్యత నివ్వాలన్నారు. వారి ఉత్పత్తి సామర్ధాన్ని బలోపేతం చేయడానికి ఆర్థిక సహాయం అందించాలని కోరారు. కరోనా మహామ్మారి ప్రభావాన్ని నియంత్రించేందుకు, తగ్గించేందుకు, అధిగమించేందుకు మహిళలు, పిల్లలు, యువకులు, వృద్ధులతో సహా ప్రభావితమైన అన్ని దేశాల వారికి అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చాయి. కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రపంచ ప్రజా ప్రయోజనకారిగా పరిగణించాల్సిన అవసరాన్ని గుర్తించారు. టీకా జాతీయతను తిరస్కరించాలన్నారు. నిల్వలను నివారించాలని సూచించారు. టీకా ముడిపదార్థాలపై ఎగుమతి ఆంక్షలను ఎత్తివేయాలని జాంగ్‌ పేర్కొన్నారు. మహామ్మారిని అధిగమించడానికి అన్ని దేశాలు కలిసి పనిచేయడం ఒక్కటే మార్గమని నొక్కి చెప్పారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సరసమైన ధరలకు వాక్సిన్లు అందుబాటులో లేవని పేర్కొన్నారు. అవసరానికి మించి వాక్సిన్లను నిల్వచేయంపై జాంగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదంలో ఉన్నవారికి టీకాలు వేయడానికి ప్రాధాన్యత నివ్వాలని అన్నారు. వాక్సిన్ల న్యాయమైన పంపిణీకోసం పిలుపునిచ్చారు. వాక్సిన్లను సకాలంలో ఆయా దేశాలకు అందేలా చూడాలని పేర్కొన్నారు. ఉత్పత్తి సామర్ధ్యాల బలోపేతానికి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలకు ఆర్ధిక సహాయం అందించాలని పిలుపునిచ్చారు. వాక్సిన్‌ పరిశోధన,ఉత్పత్తి, డెలివరీలో ప్రైవేటురంగం, విద్యాసంస్థల ప్రయత్నాలను జాంగ్‌ స్వాగతించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img