Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

వాతావరణం పరిరక్షణ కీలకం : జిన్‌పింగ్‌

బీజింగ్‌: చైనాఅమెరికా దేశాల మధ్య జరిగిన వర్చువల్‌ సమావేశం నిష్కపటమైన, నిర్మాణాత్మక, వాస్తవిక, ఉత్పాదక సమావేశమని ఆయా దేశాల అధినేతలు పేర్కొన్నారు. మంగళవారం జరిగిన వర్చువల్‌ సమావేశం గురించి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మాట్లాడుతూ. చైనాఅమెరికాలు సముద్రంలో ప్రయాణించే రెండు పెద్దనౌకలతో సరిపోల్చారు. ఈ రెండు పెద్దనౌకలు టిల్లర్‌పై విరిగిపోకుండా స్థిరంగా ఉంచడం ముఖ్యమని అన్నారు. దిశను, వేగాన్ని కోల్పోకుండా ఒకదానితో ఒకటి ఢీ కొనకుండా కలిసిముందుకు సాగుతాయన్నారు. రెండు వైపులా పరస్పరం సామాజిక వ్యవస్థ, అభివృద్ధి మార్గాన్ని గౌరవించుకోవాలి, ఒకరి ప్రధాన ఆసక్తులు ప్రధాన ఆందోళనలను గౌరవించుకోవాలని పరస్పరం గౌరవించుకోవాలని పేర్కొన్నారు. గత 50ఏళ్లలో చైనాఅమెరికాల పున:ప్రారంభం అభివృద్ధి ముఖ్యమైన అంశాలుగా పేర్కొన్నారు. ఇది ప్రపంచ దేశాలకు ప్రయోజనం చేకూర్చిందన్నారు. వాతావరణ మార్పు, కొవిడ్‌19 మహమ్మారి ప్రభావం వంటి ప్రపంచ సవాళ్లకు సమర్థవంతమైన ప్రతిస్పందనలను కనుగొనడంతోపాటు రెండు దేశాల సంబంధిత అభివృద్దిని ముందుకు తీసుకెళ్లడానికి శాంతియుత, స్థిరమైన అంతర్జాతీయ వాతావరణాన్ని పరిరక్షించడానికి ఈ సమావేశం కీలకమని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img