Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

వాతావరణమార్పుల నియంత్రణ అత్యవసరం లండన్‌కు పర్యావరణవేత్తలు

బ్రిటన్‌ : వాతావరణ మార్పుల నియంత్రణకు అత్యవసర చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ కొన్ని రోజులుగా ప్రదర్శన చేస్తున్న పర్యావరణ వేత్తలు శుక్రవారం లండన్‌ నగరానికి చేరుకున్నారు. భవిష్యత్తు కోసం, వ్యవస్థ మార్పుకోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా బ్యాంక్‌ ఆఫ్‌ఇంగ్లాండ్‌ ముందు వందలాది మంది నిరసించారు. డజన్లకొద్దీ ఆర్ధిక సంస్థలు, దేశ ఆర్థిక కేంద్రమైన లండన్‌ నగరానికి ఈప్రదర్శన చేరింది. ప్రధానంగా చమురు, సహజ వాయువు, బొగ్గు వంటి శిలాజ ఇంధనాల వెలికితీత ద్వారా లాభం పొందుతున్న కంపెనీలకు, బ్యాంకు లకు వ్యతిరేకంగా ‘బ్లడ్‌ మనీ’ మార్చ్‌ చేపట్టినట్లు ప్రెన్సాలాటినాకు వీరు వెల్లడిరచారు. నిరసనల్లో భాగంగా కొర్పొరేషన్‌ భవన ముఖ భాగానికి ఎర్రటి పెయింటింగ్‌ వేసారు. ఇద్దరు నిరసనకారులు స్టాండర్డ్‌ ఛార్టర్‌ బ్యాంకు ప్రవేశం ద్వారానికి, కిటికీలకు ఎర్రటి పెయింటింగ్‌ వేశారు. నిరసన కారులు భవనంలోకి రాకుండా పోలీసులు నియం త్రించారు. ప్రస్తుత వాతావరణ సంక్షోభంలో బ్యాం కులు తమ పాత్రను గుర్తించాలని ప్రదర్శనకారులు విజ్ఞప్తి చేశారు. బార్‌క్లేస్‌, హెచ్‌ఎస్‌బీసీస వంటి బ్యాంకులు శిలాజ ఇంధన రంగంలో భారీగా పెట్టు బడులు పెడతాయని చమురు, సహజవాయులు, బొగ్గు ప్రధాన పర్యావరణ కాలుష్య కారకాలపై అవగాహన ఉండాలని కార్యకర్తలు సూచించారు. 2050 నాటికి కర్బన్‌ ఉద్గారాలను సున్నాకి తగ్గించాలనే బ్రిటష్‌ ప్రభుత్వ లక్ష్యం అమలు చేయాలని పెద్ద బ్యానర్‌ను ఈ ప్రదర్శనలో చేపట్టారు. ఈ వారాంతం, సోమవారం బ్యాంకులకు సెలవు దినలలో సైతం ఈ నిరసనలు కొనసాగు తాయని నిరసనకారులు వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img