Friday, April 19, 2024
Friday, April 19, 2024

విజయ పథంలో పుతిన్‌ పార్టీ

మాస్కో : రష్యా పార్లమెంటు ఎన్నికల్లో అధ్యక్షుడు పుతిన్‌క చెందిన యునైటెడ్‌ రష్యా పార్టీ విజయందిశంగా పయనిస్తోంది. పుతిన్‌కు ప్రజల్లో మద్దతు తగ్గినా..ఆయన పార్టీనే విజయాన్ని సాధించడం ఖాయంగా ఉంది. ఆదివారం జరిగిన రష్యా పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్‌ ముగిసిన వెంటనే యునైటెడ్‌ రష్యాపార్టీ విజయం సాధించనున్నట్లు అంచనాలు ప్రకటించాయి. పుతిన్‌ వ్యతిరేకులెవరూ ఈ ఎన్నికల బరిలో లేరు. పోటీలో నిలిచిన అభ్యర్థుల్ని క్షుణ్ణంగా పరిశీలించాకే వారికి సీట్లను కేటాయించడం జరిగింది. బ్యాలెట్‌ బాక్సుల్లో అక్రమ ఓట్లు పోలైనట్లు ఆరోపణలు ఉన్నప్పటికీ పోలింగ్‌లో ఎటువంటి అక్రమాలు జరగలేదని రష్యా ఎలక్షన్‌ కమిషన్‌ ప్రకటించింది. డుమాలోని(పార్లమెంటు) 450 సీట్లలో 300కంటే ఎక్కువ సీట్లను తమ పార్టీ గెలుచుకుందని యునైటెడ్‌ రష్యా ప్రకించింది. 2016లో పుతిన్‌ పార్టీ 54శాతం ఓట్లను సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టులకు 8శాతం మద్దతు పెరిగింది. గెన్నేడి జగనోవ్‌ నాయకత్వం వహిస్తున్న కమ్యూనిస్టుపార్టీ ఆఫ్‌ రష్యాకు 21శాతం ఓట్లు లభించాయి. నవాల్నీని జైల్లో పెట్టిన ఘటనలవల్ల పుతిన్‌కు మద్ధతు తగ్గినట్లుగా తెలుస్తోంది.
రష్యా వర్సిటీలో కాల్పులు..10మంది మృతి
పార్లమెంటు ఎన్నికల వేళ,..పెర్మ్‌ నగరంలో జరిగిన కాల్పుల్లో 10మంది మరణించారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. డజన్లమంది గాయపడ్డారు. వర్సిటీ క్యాంపస్‌లో ఓ దుండగుడు కాల్పులకు పాల్పడినట్లు సమాచారం. కాల్పులకు భయపడి విద్యా ర్థులు పారిపోయారు. పెర్మ్‌ స్టేట్‌ వర్సిటీ అత్యంత పురాతనమైనది. సోమవారం ఉదయం జరిగిన ఈ కాల్పులకు గాను వర్సిటీ అలర్ట్‌ ప్రకటించింది. వర్సిటీ విద్యార్థి ఈ కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. 18ఏళ్ల తైమూర్‌ గా గుర్తించారు. పోలీసులు జరిపిన ఫైరింగ్‌లో తైమూర్‌ గాయపడినట్లు ప్రాథమికి సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img