Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

విజృంభిస్తున్న డెల్టా వేరియంట్‌ : డబ్ల్యుహెచ్‌ఓ

ఐరాస: డెల్టా వేరియంట్‌ ప్రస్తుతం 135 దేశాల్లో విజృంభించింది. వచ్చే వారం నాటికి 200 మిలియన్లు దాటవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) హెచ్చరికలు జారీ చేసింది. తూర్పు, మధ్యదరా, పశ్చిమ పసిఫిక్‌ప్రాంతాల్లో గత వారంతో పోలిస్తే వరుసగా 37శాతం, 33 శాతం పెరుగుదల నమోదైంది. అగ్నేయాసియా ప్రాంతంలో 9శాతం పెరుగుదల నమోదైందని పేర్కొంంది. 182 దేశాల్లో అల్ఫా వేరియంట్‌ కేసులు నమోదుకాగా 135దేశాల్లో డెల్టా వేరియంట్‌ విజృంభిస్తోందని పేర్కొంది. దీనిలో భారత్‌కూడా ఉందని పేర్కొంది. గత వారం అత్యధిక స్థాయిలో అమెరికాలో 543,420 కొత్త కేసులు నమోదుకాగా భారత్‌లో 283,923 కొత్త కేసులు(7శాతం) నమోదయ్యాయి. థాయ్‌లాండ్‌, ఇండోనేషియా 5శాతం, బ్రెజిల్‌,ఇరాన్‌లలో కొత్త కేసులు వేల సంఖ్యలో నమోదయ్యాయి. అధికాదాయ దేశాల్లో ప్రతి 100 మందిలో దాదాపు 100 డోస్‌లు వేయగా, తక్కువ ఆదాయ దేశాల్లో ప్రతి 100మందికి 1.5 డోస్‌లను మాత్రమే ఇవ్వగలిగాయని డబ్ల్యుహచ్‌ఓ డైరెక్టర్‌ అథనామ్‌ పేర్కొన్నారు. ప్రతి దేశానికి సెప్టెంబరు చివరినాటికి కనీసం 10శాతం, ఈ సంవత్సరం చివరినాటికి కనీసం 40శాతం, వచ్చే ఏడాది మధ్య నాటికి70శాతం టీకాలు తప్పనిసరని అథనామ్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img