Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

విప్లవాత్మక వారసత్వాన్ని కొనసాగించాలి

జిన్హువా వార్తా సంస్థ వార్షికోత్సవ సభలో జిన్‌పింగ్‌

బీజింగ్‌ : చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ జిన్హువా వార్తా సంస్థను స్థాపించి 90 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అభినందనలు తెలిపారు. విప్లవాత్మక వారసత్వాన్ని కొనసాగించాలన్నారు. నూతన తరహా ఆవిష్కరణల కోసం కృషి చేస్తూనే అత్యుత్తమ విధానాలను కొనసాగించాలని కోరారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా (సీపీసీ) సెంట్రల్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి, చైర్మన్‌ అయిన జిన్‌పింగ్‌ వార్తా సంస్థ సభ్యులకు, అలాగే నవంబరు 8న చైనా జర్నలిస్టుల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు సీపీసీ సెంట్రల్‌ కమిటీ తరఫున హృదయపూర్వక అభినందలు తెలిపారు. సీపీసీ సెంట్రల్‌ కమిటీ ప్లీనరీ జరగనున్న సందర్బంగా జిన్‌పింగ్‌ ప్రత్యేక తీర్మానం విడుదల చేశారు. 2012లో సీపీసీ ప్రధాన కార్యదర్శిగా చైనాను అత్యంత శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దారు. తల్లిదండ్రులను ప్రేమిస్తున్నట్లుగా ప్రజలను ప్రేమించాలని కోరుకుంటున్నట్లు జిన్‌పింగ్‌ తెలిపారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా (సీపీసీ) 72 ఏళ్లుగా చైనాను పాలించే ఏకైక పార్టీగా చరిత్ర సృష్టించింది. మావోజెడాంగ్‌, డెంగ్‌జియావో పింగ్‌, జియాంగ్‌ జెమిన్‌, హు జింటావో వంటి ప్రతినిధుల నాయకత్వంలో చైనా వర్థిల్లింది. జిన్‌పింగ్‌ శుక్రవారం బీజింగ్‌లో జాతీయ నైతిక రోల్‌ మోడల్స్‌, నామినేషన్‌ అవార్డుల విజేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిన్‌పింగ్‌ మాట్లాడుతూ సమాజంలో నైతిక విలువలను పెంపొందించాలని సూచించారు. సద్గుణాలు లేకుండా దేశం అభివృద్ధి చెందదని, ఎవరూ విజయం సాధించలేరని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. నిస్వార్థ భక్తి, ఉన్నతంగా ఉండటం కమ్యూనిస్టుల నిర్వచించే లక్షణాలని, వీటిని అధికారులు పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. మన దేశాన్ని, సమాజాన్ని నడిపించడంలో చట్టబద్ధమైన పాలన, ధర్మానికి రెండిరటికీ ప్రాధాన్యతనివ్వాలన్నారు. అధికారులందరూ, ముఖ్యంగా ఉన్నత స్థానాల్లో ఉన్నవారు, సమగ్రతను, స్వీయ-క్రమశిక్షణను నిలబెట్టడంలో, ప్రజల కోసం ప్రజా అధికారాన్ని వినియోగించడంలో, సమగ్రత, సంస్కృతిని సృష్టించడంలో రోల్‌మోడల్స్‌గా ఉండాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img