Friday, April 19, 2024
Friday, April 19, 2024

వెనిజులాకు 25 కమ్యూనిస్టుపార్టీల మద్దతు

కారకస్‌ : దేశంలో సామ్రాజ్యవాద నియంతృత్వ ధోరణలకు వ్యతిరేకంగా, కార్మికవర్గ ప్రయోజనాలను, హక్కులను కాలరాసే పెట్టుబడీదారీ నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా 25కిపైగా కమ్యూనిస్టు, వర్కర్స్‌ పార్టీలు కమ్యూనిస్ట్‌పార్టీ ఆఫ్‌ వెనిజులా (పీసీవీ)కు సంఫీుభావం ప్రకటించాయి. పీసీవీ జనరల్‌ సెక్రటరీ ఆస్కార్‌ ఫిగూరాపై జాతీయ అసెంబ్లీలో జరిగిన దాడులను ముక్తకంఠంతో ఖండిరచాయి. 90 సంవత్సరాలుగా తన సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు సీపీవీ సామ్రాజ్య వ్యతిరేకం పోరాటాల సుదీర్ఘ సాంప్రదాయం కలిగింఉంది. వెనిజులా ప్రజల హక్కులకు భంగం కలిగించడాన్ని కమ్యూనిస్టుపార్టీలు ఖండిరచాయి. ఈ నేపధ్యంలో పీసీవీ ఒక ప్రకటన విడుదల చేసింది. సామ్రాజ్యవాద దేశాల జోక్యం ద్వారా నికోలస్‌ మదురో ప్రభుత్వాన్ని కూలదోయాలని సంకల్పించడం సరైన పద్ధతికాదన్నారు. ట్రేడ్‌యూనియన్లను నిర్బంధించడాన్ని ఈ ప్రకటన ఖండిరచింది. కార్మికులు, విప్లవ సంస్థలు రాజకీయ హక్కులను కోల్పోయేలే వ్యాపార ప్రయోజనాలకు అనుకూలంగా చేపట్టేచర్యలను పీసీవీ ఖండిరచింది. నవంబరు 21న జరిగే స్థానిక ఎన్నికల్లో సీపీవీ, పాపులర్‌ రివల్యూషనరీ ఆల్టర్నేటివ్‌ (ఏపీఆర్‌) అభ్యర్థులకు ఆటంకం కలిగించడంతోపాటు ప్రజల మద్దతు లేకుండా వారిని నిరోధించడం వంటి చర్యలను పీసీవీ తప్పుబట్టింది. పీసీవీ మీడియా బ్లాక్‌ అవుట్‌ను పునరుద్ఠాటించమని డిమాండ్‌ చేసింది. వెనిజులాకు వ్యతిరేకంగా సామ్రాజ్యవాద ప్రణాళికలను ప్రాథమిక రాజకీయ, ప్రజాస్వామ్య హక్కులను ఉల్లంఘిస్తూ చేపట్టిన వివిధ చర్యలను పీసీవీ ఖండిరచింది. పీసీవీకి వ్యతిరేకంగా కమ్యూఇస్టు దాడులను నిలిపివేయాలని రాజకీయ,ఎన్నికల హక్కులను పునరుద్ధరించాలని పీసీవీ డిమాండ్‌చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img