Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం : పుతిన్‌

మాస్కో, : ప్రపంచ ఆహార భద్రత,సవాళ్లు, వ్యవసాయం, ఇంధన రంగాలలో ద్వైపాక్షిక సహకారంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌, బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సోనారో సోమవారం టెలిఫోన్‌లో చర్చించారు. పాశ్చాత్య దేశాల ఆంక్షల వల్ల గతంలో అంతరాయం ఏర్పడిన ఆహార పదార్థాలు, ఎరువుల స్వేచ్ఛా వాణిజ్యాన్ని పునరుద్ధరించడం ప్రాముఖ్యతను రష్యా అధ్యక్షుడు నొక్కిచెప్పారు. బ్రెజిల్‌్‌ రైతులకు రష్యా ఎరువుల సరఫరాకు పుతిన్‌ హామీ ఇచ్చారు. రష్యా, బ్రెజిల్‌ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, అనేక రంగాలలో పరస్పర ప్రయోజనకరమైన సహకారాన్ని విస్తరించడం ప్రాముఖ్యతపై ఇద్దరు నాయకులు అంగీకరించారని క్రెమ్లిన్‌ వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img