Friday, April 19, 2024
Friday, April 19, 2024

శక్తిమంతమైన ఖండాంతర
క్షిపణిని పరీక్షించిన ఉ.కొరియా

కుటుంబ సమేతంగా వీక్షించిన కిమ్‌
సియోల్‌: అత్యంత శక్తిమంతమైన కొత్త సాలిడ్‌ఫ్యూయల్‌ ఖండాంతర క్షిపణి(ఐసీబీఎం) ‘హ్వాసాంగ్‌18’ని ఉత్తర కొరియా ప్రయోగించింది. దేశ అణ్వాయుధ శక్తిని మరింత పెంచుకునే దిశగా ఉత్తర కొరియా అడుగులు వేస్తోంది. ఈ మేరకు ‘ది కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌’ ఏజెన్సీ శుక్రవారం వెల్లడిరచింది. అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ మార్గదర్శకత్వంలో ఈ క్షిపణి ప్రయోగం జరిగింది. తమ శుత్రువులను గడగడలాడిస్తామని ఈ ప్రయోగం ద్వారా ఉత్తర కొరియా చెప్పకనే చెప్పింది. అమెరికాకు పరోక్ష హెచ్చరికలు చేసింది. ఇటీవల అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా చేపట్టిన సైనిక విన్యాశాలను ఉత్తర కొరియా విమర్శించింది. అదే క్రమంలో తమ ఆయుధ పరీక్షలను మరింత పెంచింది. ఉత్తర కొరియా ఆయుధాలను తయారు చేస్తూనే ఉన్నదని, ఆ దేశం ఇంకా సాలిడ్‌ ఫ్యుయల్‌ టెక్నాలజీపై పట్టు సాధించలేదని దక్షిణ కొరియా రక్షణశాఖ పేర్కొంది. 2020 నుంచి భారీ ఆకారంలోని మోటార్లు పరీక్షిస్తోందని, ఇటువంటి పరీక్షను ఉత్తర కొరియా నిర్వహిస్తుందని ముందే అంచనా వేశామని సెంటర్‌ ఫర్‌ నాన్‌ ప్రొలిఫరేషన్‌ స్టడీస్‌కు చెందిన జేమ్స్‌ మార్టిన్‌ వెల్లడిరచారు. తాజా క్షిపణి పరీక్షను కిమ్‌ తన కుమార్తె, భార్య, సోదరితో కలిసి పర్యవేక్షించిన చిత్రాలను కేసీఎన్‌ఏ విడుదల చేసింది. ఐసీబీఎం హ్వాసాంగ్‌-18 క్షిపణి సాలిడ్‌ ప్యుయల్‌ మల్టీస్టేజ్‌ మోటార్‌ సామర్థ్యాన్ని కలిగివుంది. ఇటువంటి ఖండాంతర క్షిపణిని ఉత్తర కొరియా పరీక్షించడం ఇదే తొలిసారి.
ఈ టెక్నాలజీ విజయవంతమైతే అమెరికాపై ఎటువంటి హెచ్చరికలు లేకుండా నిమిషాల వ్యవధిలోని ఉ.కొరియా దాడి చేసే అవకాశం ఉంటుంది. సాలిడ్‌ ఫ్యుయల్‌ ఐసీబీఎంను తయారు చేయాలన్నది ఉత్తర కొరియా దీర్ఘకాలిక లక్ష్యం. యుద్ధంలో క్షిపణులను మరింత వేగంగా ప్రయోగించేందుకు ఈ సాంకేతిక ఉపయుక్తంగా ఉంటుందన్నది ఆ దేశం భావన.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img