Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

శూన్య వాగ్దానాలు వద్దు

ఇప్పటికే మా తరం విసిగిపోయింది
కాప్‌`26 సదస్సులో భారత బాలిక వినీషా గర్జన

గ్లాస్గో/స్కాట్లాండ్‌ : ప్రపంచ నాయకుల అబద్ధపు హామీలతో తమ తరం విసిగిపోయిందని తమకు కోపంగానూ, విసుగ్గానూ ఉంది. మీపై కోపం వస్తోంది. మీరు చేయలేకపోయినా కనీసం మా భవిష్యత్తును మేమైనా నిర్మించుకోవాలి.. ప్రపంచ నేతలారా.. మాతో కలసి రండి అంటూ తమిళనాడులోని తిరువణ్ణామలైకి చెందిన 14 ఏళ్ల వినీషా ఉమాశంకర్‌ ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు(కాప్‌ 26)లో ఆవేదన వెళ్లగక్కారు. ఈ బాలిక ప్రసంగం అంతర్జాతీయంగా అందరినీ ఆలోజింపచేసింది. బ్రిటన్‌ యువరాజు విలియమ్‌ ఆహ్వానం మేరకు ఎర్త్‌షాట్‌ ప్క్రెజ్‌ 15 మంది ఫైనల్స్‌లో ఒకరిగా నిలిచిన వినీషా ప్రపంచ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకనైనా వాతావరణ మార్పుల విషయంలో స్పందించి భూగ్రహాన్ని కాపాడాలని వినీషా పిలుపునిచ్చింది. మాటలు కట్టిపెట్టి, చేతలను ప్రారంభించండి అంటూ ప్రపంచ నాయకులకు హితవు పలికింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తదితరులు హాజరైన సమావేశంలో శూన్య వాగ్దానాలు చేస్తున్న ప్రపంచ నాయకులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆమె ఉద్వేగభరిత, ఉత్తేజపూరిత ప్రసంగానికి సభ చప్పట్లతో దద్దరిల్లి పోయింది.
పాత ఆలోచనా విధానాలను, అలవాట్లను విడిచిపెడతారని భావిస్తున్నానన్న వినీషా, తమ ఆవిష్కరణలు, ప్రాజెక్టులకు మద్దతుగా నిలబడాలని ది ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌ విజేతలు, ఫైనలిస్టుల తరపున ఆహ్వానిస్తున్నానని ప్రపంచ నేతలను కోరింది. ఇందుకు వారి సమయాన్ని, డబ్బును, కృషిని పెట్టుబడిగా పెట్టాలని పిలుపు నిచ్చింది. ఇందుకు ప్రపంచ నేతలు ఆలస్యం చేసినా, గతంలోనే ఉండిపోయినా, ముందుకు రాకపోయినా, తామే నాయకత్వం వహిస్తామనీ, తామే భవిష్యత్తును నిర్మిస్తామని వినీషా స్పష్టం చేసింది. అయితే తమ ఆహ్వానాన్ని మన్నించి తమతో చేతులు కలుపుతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. కాగా పారిశ్రామిక, వ్యవసాయ వ్యర్థాల రీసైక్లింగ్‌ థీమ్‌తో పర్యావరణాన్ని కాపాడేవారిని ప్రోత్సహించేందుకుగాను బ్రిటన్‌ యువరాజు కిందటి ఏడాది నవంబర్‌లో ఎర్త్‌షాట్‌ ప్క్రెజ్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. వ్యర్థ రహిత ప్రపంచాన్ని నిర్మించడం ద్వారా వాతావరణాన్ని సరిదిద్దడం అనే ఐదు అంశాలపై విశేషంగా కృషి చేసిన వారిని గుర్తించి సత్కరిస్తుంది. ఇందులో వినీషా ఉమాశంకర్‌ ’క్లీన్‌ అవర్‌ ఎయిర్‌’ విభాగంలో నిలిచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img