Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

శ్రీలంకకు రుణాలు ఇవ్వం: ప్రపంచ బ్యాంకు

కొలంబో : ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకకు ఎటువంటి ఆర్థిక సహాయం అందించబోమని ప్రపంచ బ్యాంక్‌ స్పష్టం చేసింది. లంకలో తగిన స్థూల ఆర్థిక విధానానికి సంబంధించి ఫ్రేమ్‌వర్క్‌ ఏర్పడే వరకు ఎటువంటి తాజా నిధులను అందించమని తెలిపింది. అయితే శ్రీలంకకు లోతైన నిర్మాణాత్మకమైన సంస్కరణలు అవసరమని వరల్డ్‌ బ్యాంక్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. దేశంలో కొనసాగుతున్న సంస్కరణలు ఆర్థిక స్థిరీకరణపై దృష్టి పెట్టాలని సూచించింది. లంకలో ప్రస్తుత పరిస్థితి కారణాలు గుర్తించి..మూలకారణాలను తొలగించాల్సిన అవసరం ఉందని, దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు సరళమైన, సమ్మిళిత పద్ధతిలో అభివృద్ధి చెందే విధానాన్ని అవలంభించాలని సూచించింది. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం, భయంకరమైన ఆర్థిక పరిస్థితి ప్రజలపై చూపుతున్న ప్రభావంపై ఆందోళన చెందుతున్నట్లు ప్రపంచ బ్యాంక్‌ తెలిపింది. పేద కుటుంబాలకు అవసరమైన మందులు, వంటగ్యాస్‌, ఎరువులు, పాఠశాల విద్యార్థులకు ఆహారం,పేద, బలహీన కుటుంబాలకు ఆర్థిక సహాయం తదితర అవసరమైన వస్తువులను నిర్ధారించేందుకు శ్రీలంకకు ఇప్పటికే జారీ చేసిన రుణ సౌకర్యాలు ఉన్నాయని ప్రపంచ బ్యాంకు తెలిపింది. శ్రీలంకలో నిత్యావసరాల కోసం ఇప్పుడు 160 బిలియన్‌ డాలర్లు అమెరికన్‌ డాలర్ల మొత్తాన్ని విడుదల చేసినట్లు ప్రపంచ బ్యాంక్‌ చెప్పింది. 22 మిలియన్ల జనాభా కలిగిన శ్రీలంక ఇంధనం, ఆహారం,ఔషధాలు, అవసరమైన దిగుమతులను పరిమితం చేస్తూ విదేశీ మారక నిల్వలు అయిపోయాయి. జూన్‌లో ద్రవ్యోల్బణం 54.6శాతంనమోదైంది. ఆహార ద్రవ్యోల్బణం 80 శాతం పెరిగింది. సహాయక చర్యల్లో నిమగ్నమైన ఇతర మిత్రదేశాల సమన్వయంతో లంక ప్రజలు గరిష్ఠ ప్రయోజనం పొందేలా ప్రపంచ బ్యాంక్‌ తరఫున ప్రయత్నిస్తున్నామని పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img