Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

షింజో అబే తీరుతో తీవ్ర అసంతృప్తి చెందా..అందుకే కాల్చేశా

పోలీసుల విచారణలో నిందితుడు వెల్లడి
జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే ఇవాళ ఉదయం ఓ రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఓ వ్యక్తి ఆయనపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో అబేపై దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఇందులో షూటర్‌ ఈ హత్య వెనుక కారణాలు వెల్లడిరచాడు. షింజో అబేను కాల్చి చంపిన షూటర్‌.. 41 ఏళ్ల, జపనీస్‌ మారిటైమ్‌ సెల్ఫ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ మాజీ సభ్యుడిగా పోలీసులు గుర్తించారు. జపనీస్‌ మారీటైమ్‌ సెల్ఫ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ మాజీ సభ్యుడని, అబేపై కాల్పులు జరిపిన తుపాకీని స్వయంగా తయారు చేసినట్లు అధికారులు తెలిపారు. అతని నివాసం నుండి భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ‘’షింజో అబేపై అసంతృప్తితో ఉన్నానని, అందుకే ఆయన్ని చంపాలని నిర్ణయించుకున్నానని ‘’ అంటూ టెత్సుయా విచారణలో పోలీసులకు సమాధానం ఇచ్చాడు. అయితే అతని అసంతృప్తికి కారణాలు ఏమిటన్నది వెల్లడిరచలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img