Friday, April 19, 2024
Friday, April 19, 2024

సమూల మార్పుకోసం ఇరాక్‌ కమ్యూనిస్టుల పిలుపు

   ఇరాక్‌ : ఇరాక్‌ కమ్యూనిస్టులు దేశంలో సమూల మార్పుకోసం ఎన్నికలను బహిష్క రించారు. ఈ నెల 10వ తేదీన జరిగిన ఎన్నికల పోలింగ్‌ అతి తక్కువగా నమోదైంది.  కేవలం 20శాతం మంది మాత్రమే ఓటింగ్‌లో పాల్గొన్నారు. లోప భూయిష్ట ఎన్నికల చట్టంతో సహా ఎన్నికల ప్రక్రియలో తలెత్తిన వివిధ అంశాలపై ఇరాక్‌ కమ్యూనిస్టులు తీవ్ర అందోళన వ్యక్తం చేసారు. దేశంలో జాతి మతపరమైన అధికారం పంచుకునే రాజకీయ వ్యవస్థ నుండి విముక్తి పొంది సమూల మార్పుకు కమ్యూనిస్టు పార్టీ సంకల్పించింది. అయితే లోపభూయుష్ట ఎన్నికల చట్టంతో సహా ఎన్నికల ప్రక్రియలోని వివిధ అంశాల గురించి తీవ్ర అందోళన వ్యక్తమవుతోంది. అవినీతి రాజకీయ నాయ కులు, వారి పార్టీలపై నియంత్రణ చర్యలు లేకోపవడంతో ఎన్నికల్లో విపరీతంగా డబ్బు పంచడం ద్వారా ఓటు కొనుగోలు ప్రారంభమైంది. 2018 లో గత పార్లమెంట్‌ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం 20% నమోదైంది. అక్టోబరు తిరుగుబాటు సమయంలో 700 మందికి పైగా శాంతియుత నిరసనకారులను హత్య చేసిన నేరస్థులకు తప్పనిసరిగా న్యాయాం చేయాలనేది కమ్యూని స్టుల ప్రధాన డిమాండ్‌. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఇరాక్‌ కమ్యూనిస్టు పార్టీ, తన పార్టీ సభ్యులు, సంస్థల అంతర్గత ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించిన తరువాత, జూలై 2021లో ఎన్నికలను బహిష్కరించే నిర్ణయాన్ని ప్రకటిం చింది. స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికల ద్వారా శాంతియుత ప్రజాస్వామ్య మార్గాన్ని నిరోధించడం రాజకీయ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేయడంతోపాటు తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. పౌర శాంతికి ప్రమాదం కలిగిస్తుంది. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img