Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సమ్మిళిత ఆర్థిక వ్యవస్థకు చైనా ప్రధాని పిలుపు

బీజింగ్‌: తూర్పు ఆసియా ప్రాంతీయ సమ్మిళిత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలని, అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ప్రజారోగ్యం, ఆహారం, ఆర్థికరంగాలపై సవాళ్లకు సంయుక్తంగా ప్రతిస్పందించాలని చైనా ప్రధాని లీ కెకియాంగ్‌ బుధవారం పిలుపునిచ్చారు. బీజింగ్‌లో జరిగిన 24వ ఆసియా చైనా, జపాన్‌, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా (10G3) దేశాల శిఖరాగ్ర సమావేశంలో వీడియో లింక్‌ ద్వారా కెకియాంగ్‌ ప్రసంగించారు. ప్రజారోగ్య పాలనను మెరుగుపరచడం, ప్రాంతీయ ఆర్థిక ఏకీకరణను మరింతగా పెంచడం, పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేయడం, డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం, ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించడం, తూర్సుఆసియాలో స్థిరమైనవృద్ధిని ప్రోత్సాహాకానికి లి ప్రతిపాదన చేశారు. తూర్పు ఆసియా దేశాల ప్రాంతీయసమగ్ర ఆర్థిక భాగస్వామ్యం త్వరలో అమల్లోకి వచ్చేస్థాయికి చేరుకుంటుందని లి పేర్కొన్నారు. స్వేచ్ఛా వాణిజ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని కెకియాంగ్‌ సూచించారు. ప్రాంతీయ ఆహార భద్రత మెరుగుదలకు ఎమర్జెన్సీ రైస్‌ రిజర్వ్‌కు మద్దతుతోపాటు ఇన్‌పుట్‌ పెంచాలని కెకియాంగ్‌ పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img