Friday, April 19, 2024
Friday, April 19, 2024

సరిహద్దుల్లో అఫ్గాన్‌ ప్రజలు

కాబూల్‌: అఫ్గాన్‌ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లినప్పటి నుండి రోజుకో కీలక పరిణామాలు చోటుచేసుకుంటు న్నాయి. తాలిబన్ల పరిపాలనకు భయపడి దేశం విడిచి వెళ్లేందుకు కాబూల్‌లోని హమీద్‌ కర్జాయ్‌ అం తర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే మార్గం కావడంతో వేలాదిమంది రోజుల తరబడి విమానాశ్రయం వద్ద పడిగాపులుపడ్డారు. ఇదే అదనుగా ఇస్తామిక్‌ స్టేట్‌ ఖొరాసన్‌ ప్రావిన్స్‌ విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిరది. ప్రస్తుతం విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. అక్కడున్న అఫ్గాన్లను వెనక్కి పంపించేస్తున్నారు. అయితే దేశం విడిచి వెళ్లేందుకు మాత్రం ప్రయత్నాలను కొనసాగిస్తు న్నారు. వేలాదిమంది దేశసరిహద్దులకు వెళుతుండట ం కనిపిస్తోంది. అందుబాటులోఉన్న ప్రయాణ సాధనాల ద్వారా సరిహద్దులకు చేరుకుంటున్నారు. పాకిస్తాన్‌, ఇరాన్‌, తజకిస్తాన్‌ వంటి సరిహద్దుల వద్ద బారులు తీరారు. నగదును విత్‌ డ్రా చేసుకునేందుకు బ్యాంకుల ముందు పడిగాపులు పడుతున్నారు. ఇప్పటికే బ్యాంకుల్లో లావాదేవీలను నిలిపివేశారు. ఆసుపత్రులు కూడా దాదాపు స్తంభించిపోయాయి. పాక్‌`అఫ్గాన్‌ సరిహద్దుల్లోని టోరామ్‌, ఇరాన్‌ వద్ద ఖలా పాయింట్‌ వద్ద జనం తాకిడి పెరిగింది. హెరాత్‌ మీదుగా ఇస్లామ్‌ ఖలా సరిహద్దుకు కాలినడకన బయలుదేరుతున్నారు. ఈ పాయింట్‌ దాటితే ఇరాన్‌లో అడుగుపెట్టవచ్చు. తమ దేశానికి శరణార్థులుగా వచ్చే అఫ్గాన్‌ల కోసం ఇరాన్‌, పాక్‌ ప్రభుత్వాలు కొన్ని సౌకర్యాలు కల్పించడంతో ప్రజలు గుమిగూడుతున్నారు. జలాలాబాద్‌ సమీపంలోని టోరమ్‌ బోర్డర్‌కు అఫ్గాన్‌లు తరలివస్తున్నారు. టోరామ్‌ బోర్డర్‌ దాటితే పాక్‌లోని పెషావర్‌లోకి చేరుకుంటారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img