Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సామాజిక పురోగతికి సోషలిజమే మార్గం: పీసీబీ

బ్రసీలియా : బ్రెజిల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ (పీసీబీ) అక్టోబర్‌ 2వ తేదీన జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు తమ అభ్యర్థుల జాబితాను సమర్పించింది. ప్రసజలతో మాటాలడే సమయంలో కమ్యూనిస్టు అభ్యర్థులు పెట్టుబడిదారీ వ్యతిరేక, సామ్రాజ్యవాద వ్యతిరేక రాజకీయ కార్యక్రమాన్ని వివరించారు. సోఫియా మంజానో, ప్రొఫెసర్‌, ఆర్థికవేత్త, అధ్యక్ష అభ్యర్థి కాగా ఆంటోనియో అల్వెస్‌, ట్రేడ్‌ యూనియన్‌ అభ్యర్థి ఉపాధ్యక్ష పదవికి ఎన్నికల బరిలో నిలిచారు. పీసీబీ అభ్యర్థులు వివిధ డిమాండ్లపై బ్రెజిల్‌ కార్మికులతో తాజాగా చర్చలు జరిపారు. దేశం ప్రస్తుతం గత అర్ధ శతాబ్దకాలంగా అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థిక, సామాజిక, రాజకీయ సంక్షోభం, బ్రెజిలియన్‌ పెట్టుబడిదారీ విధానంలోని ప్రధాన లోపాలుగా ఉన్నాయి. దీని పర్యవసానం ప్రజల జీవితాలపై పెను ప్రభావం చూపింది. మూడు దశాబ్దాలకు పైగా ‘‘నయా ఉదారవాద’’ విధానాల వల్ల బ్రెజిల్‌ తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటోంది. పారిశ్రామికీకరణ ప్రక్రియను తీవ్రతరం చేయడంతోపాటు జాతీయ, అంతర్జాతీయ గుత్తాధిపత్యానికి అనుకూలంగా ప్రభుత్వ నిధులను వృధా చేసింది. కార్మికులు, యువకులు,పెన్షనర్ల హక్కులు, వేతనాలు తగ్గించబడ్డాయి, అక్టోబర్‌ ఎన్నికల నేపథ్యంలో శ్రామిక వర్గానికి బోల్సోనారిజం ప్రధాన ముప్పుగా గుర్తించినప్పటికీ, కార్మికవర్గం దాని దోపిడీదారుల మధ్య ప్రజా ఉద్యమాలు ఉద్బవించాయి. బోల్సోనారో ఓటమిని ప్రతిపాదించే సంస్కరణవాద రాజకీయ ప్రత్యామ్నాయాలతో పొత్తు పెట్టుకోలేమని బ్రెజిలియన్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ స్పష్టం చేసింది. ఇది దేశాన్ని సంక్షోభం నుండి బయటపడేయడానికి, సోషలిజం నిర్మాణం ద్వారా సామాజిక పురోగతికి విప్లవాత్మక ప్రత్యామ్నాయాన్ని పురికొల్పింది.
అధ్యక్ష పదవికి సోఫియా మంజానో:స్టేట్‌ యూనివర్శిటీ ఆఫ్‌ సౌత్‌వెస్ట్‌ బహియాలో ప్రొఫెసర్‌ అయిన సోఫియా మంజానో 1971లో సావో పాలోలో జన్మించారు. ఆమె పొంటిఫికల్‌ కాథలిక్‌ యూనివర్శిటీ నుండి ఆర్థిక శాస్త్రంలో పట్టా పొందారు, ఆర్థికాభివృద్ధిలో మాస్టర్స్‌ డిగ్రీ యూనిక్యాంప్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌, యూనివర్శిటీ ఆఫ్‌ సావో పాలో నుండి ఆర్థిక చరిత్రలో పట్టాపొందారు.ు 1989 నుండి బ్రెజిలియన్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ (పీసీబీ) సభ్యురాలు. ఆమె 1991లో 9వ పీసీబీ కాంగ్రెస్‌లో పాల్గొంది. 1992లో పిసిబి విప్లవాత్మక పునర్నిర్మాణం కోసం సెంట్రల్‌ కమిటీలో ఆమె చేరారు. యూనివర్శిటీ విద్యార్థిగా చురుకుగా ఉండటం, సోఫియా మంజానో యూనియన్‌ ఆఫ్‌ కమ్యూనిస్ట్‌ యూత్‌ పుననర్వ్యవస్థీకరణలో ముఖ్యమైన పాత్ర పోషించింది. ఆమె రిపబ్లిక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అభ్యర్థిగా, 2014లో, మౌరో ఇయాసితో టిక్కెట్‌పై పోటీ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img