Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

సామ్రాజ్యవాదంపై సమిష్టి పోరాటం

డబ్ల్యూఎఫ్‌డీఐ పునరుద్ఘాటన

బీరుట్‌: రాజకీయ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించే లక్ష్యంతో వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ యూత్‌ (డబ్ల్యు ఎఫ్‌డీవై) ఆదివారం లెబనాన్‌లో సమావేశమైంది. విప్లవాత్మక, ప్రగతిశీల, సామాజిక న్యాయ ప్రక్రియలలో పోరాట పంథాను పునఃప్రారంభించేందుకు వ్యూహాలను పంచుకోవడానికి, విశ్లేషించడానికి సుమారు 35 దేశాలకు చెందిన ప్రతినిధులను ఈ సమావేశం (జనరల్‌ అసెంబ్లీ) ఒకచోట చేర్చింది. లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో రెండవ సారి జరిగిన సమావేశానికి డబ్ల్యుఎఫ్‌డీవై ఉపాధ్యక్షుడు, జాతీయ సమాఖ్యల ప్రతినిధులు, కమ్యూనిస్ట్‌ యువజన విభాగాల సభ్యులు హాజరయ్యారు. బ్రెజిల్‌, క్యూబా, వెనిజులా సహా ఆఫ్రికా, యూరప్‌, ఆసియా, మధ్య ప్రాచ్యం, అమెరికా నుంచి యువజన ప్రతినిధులు హాజరయ్యారు. సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా వామపక్ష ఆదర్శాలతో మెరుగైన ప్రపంచం కోసం సమష్టి పోరాటాన్ని బలో పేతం చేయాల్సిన అవసరాన్ని ఈ సమావేశం పునరుద్ఘాటించినట్లు డెమోక్రటిక్‌ యూత్‌ ఆఫ్‌ లెబనాన్‌ అసిస్టెంట్‌ సెక్రటరీ జనరల్‌ సుకైన బాస్మా తెలిపారు. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒక సారి జరిగే డెమోక్రటిక్‌ యూత్స్‌ జనరల్‌ అసెంబ్లీ కార్యక్రమంలో సెమినార్లు, కీలక ప్రసంగాలు, సంఫీుభావ కార్యకలాపాలు, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక కేంద్రంగా ఉంటాయని చెప్పారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఫాసిజానికి వ్యతిరేకంగా, నవంబర్‌ 10, 1945న బుడా పెస్ట్‌లో డబ్ల్యుఎఫ్‌డీవై ఏర్పాటైంది. ప్రపంచ వ్యాప్తంగా యువకుల మధ్య శాంతి, స్నేహాన్ని పెంపొందించాలనేది డబ్ల్యుఎఫ్‌డీవై లక్ష్యం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img