Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సామ్రాజ్యవాదం లేని నూతన ప్రపంచం వెనిజులా అధ్యక్షుడు మదురో పిలుపు

ఐరాస : సామ్రాజ్యవాదం లేని నూతన ప్రపంచం కోసం మదురో పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ 76వ వార్షికోత్సవం సందర్భంగా దక్షిణ అమెరికా దేశమైన వెనిజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురో రికార్డు చేసిన ప్రసంగాన్ని పంపారు.. మదురో ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు తీవ్ర కఠిన ఆంక్షలు విధించిన అమెరికా సామ్రాజ్యవాద విధానాలను తీవ్రంగా గర్హించారు. ఆర్థిక, సైనిక, రాజకీయ ఆధిపత్యం,ో సామ్రాజ్యవాద విధానాల నుండి ప్రపంచం విముక్తి పొందాలన్నారు. శతాబ్దాలుగా వలసవిధానాలు,దోపిడీ, ఆధిపత్యం, అణచివేత చర్యలనుండి ప్రపంచాన్ని విముక్తి చేయాలని మదురో పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యవస్థపై ఏకపక్ష ఆధిపత్యాన్ని కోరుకుంటున్న అమెరికా వెనిజులా, క్యూబా, నికరాగువా, సిరియాలతో సహా అనేక దేశాలపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని పేర్కొన్నారు.
చైనాకు వ్యతిరేకంగా అమెరికా దూకుడు ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీస్తుందని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో సైనిక చర్యలు, తాజాగా రూపొందిన ఔకస్‌ భద్రతా భాగస్వామ్యం ప్రపంచ దేశాల మధ్య మరింత ఉద్రిక్తతలకు దారితీస్తుందన్నారు. ప్రజలపై నూతన తరహా వలసవాదం, ఆధిపత్యం, దోపిడీ, అణచివేత చర్యలను మదురో ఖండిరచారు.అందుకే ఈ సాధారణ సమావేశంలో ..వెనిజులా వలసవాదం, సామ్రాజ్యవాదం, ఎటువంటి ఆధిపత్యంలేని నూతన ప్రపంచం కోసం పిలుపునిస్తోంది అని మదరో వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img