Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

సామ్రాజ్యవాదాన్ని దునుమాడిన అంతర్జాతీయ కమ్యూనిస్టు పార్టీలు

ఏథెన్స్‌ : అంతర్జాతీయ సమావేశాలలో కమ్యూనిస్ట్‌, వర్కర్స్‌ పార్టీలు (ఐఎమ్‌సీడబ్ల్యుపీ) ,అంతర్జాతీయ కమ్యూనిస్ట్టు రివ్యూ (ఐసీఆర్‌), యూరోపియన్‌ కమ్యూనిస్టు ఇనిషియేటివ్‌ (ఈసీఐ)లు సంయుక్తంగా పాల్గొంటాయని ఏథెన్స్‌లో జరిగిన కమ్యూనిస్టు పార్టీల సమావేశంలో గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ (కేకేఈ) ప్రధాన కార్యదర్శి కౌట్సంబస్‌ పేర్కొన్నారు. అనేక అంశాల్లో ఉమ్మడిగా కమ్యూనిస్టు పార్టీలు పోరాడుతున్నాయని అన్నారు. శ్రామిక వర్గం, ఇతర వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, శ్రామికవర్గ అంతర్జాతీయవాదాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తామని అన్నారు. కేకేఈ ప్రధాన కార్యాలయంలో సోదర కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధుల చతుర్భుజ సమావేశంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులను కౌట్సంబస్‌ స్వాగతించారు. సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమ సమావేశంలో గ్రీస్‌ కమ్యూనిస్టుపార్టీ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ మెక్సికో, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌స్పెయిన్‌, టర్కీ దేశాలు పాల్గొన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో కజకిస్థాన్‌లో జరిగిన కార్మికుల పోరాటాలు, ప్రజా తిరుగుబాటుకు ఈ పార్టీలు సంఫీుభావం తెలిపాయి. ఉక్రెయిన్‌లో జరుగుతున్న సామ్రాజ్యవాద యుద్ధంపై ప్రపంచవ్యాప్త కమ్యూనిస్టు పార్టీలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. దీనికి గణనీయమైన సంఖ్యలో కమ్యూనిస్ట్‌ యువజన సంస్థలు మద్దతు ఇచ్చాయి.
ఉక్రెయిన్‌లో యుద్ధానికి సంబంధించిన పరిణామాలు, ముఖ్యమైన అంతర్జాతీయ పరిణామాలపై చర్చించడానికి, కమ్యూనిస్టు పార్టీల పోరాటం నుండి అనుభవాల మార్పిడికి ఉమ్మడి కార్యాచరణ అభివృద్ధికి ఏథెన్స్‌ సమావేవం వేదికైంది. విప్లవాత్మక ప్రాతిపదికన అంతర్జాతీయ కమ్యూనిస్ట్‌ ఉద్యమ ఐక్యత, పునర్వ్యవస్థీకరణ బలోపేతానికి, ఉమ్మడి కార్యకలాపాలకు కృషి చేయాలని ఈ సమావేశం తీర్మానించింది.పెట్టుబడిదారీ అనాగరికత పారద్రోలేందుకు, వర్గ పోరాటం బలోపేతానికి అన్ని విధాలుగా ప్రోత్సాహాన్ని అందిస్తామని కమ్యూనిస్టు పార్టీలు హామీ ఇచ్చాయి. పెట్టుబడిదారీ దేశాలలో కార్మికవర్గం, ప్రజాదరణ పొందిన వర్గాలు, యువత, మహిళలు ఎదుర్కొంటున్న పరిణామాలు, బాధలు, సమస్యల నుండి సోషలిజం ఉద్భవించింది.
అఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌, సిరియా, లిబియా, యెమెన్‌, ఆఫ్రికాలోని మాలి, ప్రపంచంలోని అనేక ఇతర ప్రాంతాలలో సామ్రాజ్యవాద యుద్ధాలను కమ్యూనిస్టు పార్టీలు ఖండిరచాయి. ప్రపంచ యుద్ధాలకు దారితీసే సామ్రాజ్యవాద గుత్తాధిపత్యం, బూర్జువా రాజకీయాలు, ముడి పదార్థాలు, ఖనిజ సంపద, వస్తువుల రవాణా మార్గాలు, భౌగోళిక రాజకీయాలు, మార్కెట్‌ వాటాలపై బూర్జువా ప్రభుత్వాల ఆధిపత్యాన్ని మూకుమ్మడిగా ఖండిరచినట్లు ఈ సమావేశం పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img