Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సాహిత్యంలో టాంజానియా రచయితకు నోబెల్‌

స్టాక్‌హాల్మ్‌ : టాంజానియా రచయిత అబ్దుల్‌ రజాక్‌ గుర్నాను ప్రతిష్టాత్మక నోబెల్‌ పురస్కారం వరించింది. వలసవాదంపై రాజీలేని పోరాటం చేసినందుకు, శరణార్థుల వ్యధను కళ్లకు కట్టినందుకు అబ్దుల్‌ను ఎంపిక చేసినట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ప్రకటించింది. ఆయన రాసిన ‘ప్యారడైజ్‌’ (1994) నవలకుగాను ఈ అవార్డు అందిస్తున్నట్లు తెలిపింది. ఇది ఆయన రాసిన నాల్గవ నవలగా పేర్కొంది. అబ్దుల్‌ రజాక్‌ గుర్నా 1948లో టాంజానియాలో జన్మించారు. జాంజిబార్‌ ద్వీపంలో పెరిగారు. 1960 చివరలో శరణార్థిగా ఇంగ్లండ్‌ చేరుకున్నారు. ఆపై కెంట్‌, కెంటర్‌బరీ యూనివర్సిటీలో ఇంగ్లీష్‌, వలసరాజ్యాల సాహిత్యం ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఇటీవలి పదవీ విరమణ పొందారు. అబ్దుల్‌ రజాక్‌ గుర్నా పది నవలలు.. అనేక చిన్న కథలను ప్రచురించారు. 21ఏళ్ల వయస్సులో ఆంగ్లంలో రాయడం ప్రారంభించారు. స్వాహిలి ఆయన మాతృభాష అయినప్పటికీ, ఇంగ్లీష్‌ ఆయన సాహిత్య సాధనంగా మారింది. సామ్రాజ్యవాద శృంగారం’గా ఆయన పిలిచే ప్రేమ వ్యవహారం గురించి ‘డిసెర్షన్‌’ (2005) నవలలో వివరించారు. ఇందులో వలసవాదంలో స్వదేశీ జనాభా వ్యథను చెప్పారు’ అని నోబెల్‌ ప్యానల్‌ పేర్కొంది. ఇదిలావుంటే, ఇప్పటివరకు సాహిత్యంలో 117 మందిని నోబెల్‌ వరించింది. చివరగా ఆర్ధికశాస్త్రం, శాంతి విభాగంలో విజేతలను ప్రకటిస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img