Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సిడ్నీకి వరదపోటు

85వేల ఇళ్లకు ముప్పు
రాత్రికి రాత్రి ఖాళీ చేయించిన అధికారులు
ప్రమాదస్థాయిలో ప్రవహిస్తున్న నదులు

సిడ్నీ : ఆస్ట్రేలియాలోని అతిపెద్ద నగరమైన సిడ్నీలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. నదులన్నీ ఉప్పొంగగా బుధవారానికి పరిస్థితి కాస్త మెరుగు అయింది. నదులన్నీ ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాjయి. దాదాపు 85వేల ఇళ్లు ముంపునకు గురాయ్యయి. సిడ్నీలో వరద శాంతించింది. అయినాగానీ హావ్‌కేస్‌బరీనేపియన్‌ నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవేహిస్తున్నాయని అత్యవసర సేవల మంత్రి స్టీఫ్‌ కూకె తెలిపారు. ఉత్తర సిడ్నీలోని హంటర్‌ వ్యాలీలో సింగిల్టన్‌, ముస్వెల్‌బ్రూక్‌ ప్రాంతాలలో అత్యవసర ప్రతిస్పందన బృందాలు ఇంటింటికి వెళ్లి స్థానికులను నిద్రలో నుంచి లేపి సురక్షిత ప్రాంతాలకు రాత్రికిరాత్రే తరలించారు. బుధవారం నాటికి 85వేల మంది తమ ఇళ్లను ఖాళీ చేయగా మంగళవారం 50వేల ఇళ్లు ఖాళీ అయినట్లు న్యూసౌత్‌ వేల్స్‌ రాష్ట్ర ప్రీమియర్‌ దామినిక్‌ పెర్రటెట్‌ అని అన్నారు. ఐదు రోజులుగా వరద ముంపునకు గురికాని ఇళ్లు సైతం ఈ వారంలో ముంపునకు గురికావచ్చునని పెర్రోటెట్‌ తెలిపారు. వరద ముప్పు తప్పిపోలేదని, అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గురువారం నుంచి వరద బాధితులకు పరిహారం ఇస్తామని ఆస్ట్రేలియా ప్రధాని ఆంటనీ ఆల్బనీస్‌ తెలిపారు. వరద బీభత్సం సృష్టించిన రెండు రోజుల్లోగా 23 ప్రాంతాల్లో పరిహారాన్ని ప్రకటించారు. ఇంత త్వరగా చెల్లింపులు మునుప్పెప్పుడూ జరగలేదని అన్నారు. సిడ్నీకి ఇది నాల్గో వరద పోటు అని, గతేడాది మార్చి నుంచి వరదలు సంభవించాయి అని, 201920లో కార్చిచ్చు కలవరపాటుకు గురిచేసిందని గుర్తుచేశారు. ప్రకృతి వైపరీత్యాలకు వాతావరణ మార్పులే కారణమని అన్నారు. దీర్ఘకాలిక పరిష్కారాలను తాము అన్వేషిస్తున్నామని, మొదటి రోజు నుంచి వాతావరణ మార్పుపై ఆస్ట్రేలియా స్థాయిని తమ ప్రభుత్వం మార్చిందని ఆల్బనీస్‌ తెలిపారు. ఆస్ట్రేలియా తరచూ వరదలు, కార్చిచ్చు బారిన పడుతూ ఉంటుందన్న ఆయన జులై 26 నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్న క్రమంలో విపత్తు నివారణ చర్యల కోసం 4.8 బిలియన్‌ ఆస్ట్రేలియన్‌ డాలర్ల వ్యయాన్ని ప్రతిపాదిస్తామని చెప్పారు. సిడ్నీకి 450 కిమీల దూరంలోని కాల్ఫ్‌ హార్బర్‌లో గత 24 గంటల్లో అతిభారీ వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ శాస్త్ర మేనేజర్‌ జేన్‌ గోల్డింగ్‌ తెలిపారు. బలమైన అలల తాకిడి, వీచిన ఈదురు గాలులతో ఇంజిన్‌ దెబ్బతిని సముద్రంలో సోమవారం నుంచి చిక్కుకున్న హాంగ్‌కాంగ్‌కు చెందిన కార్గో ‘పోర్ట్‌లాండ్‌బే’ను బుధవారం సిడ్నీ పోర్టు బాటనీకి చేర్చినట్లు రవాణా మంత్రి క్యాథరిన్‌ కింగ్‌ తెలిపారు. ఇందుకు సహకరించిన టగ్‌ బోట్‌, రెస్క్యూ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. వారంతా తమ ప్రాణాలను పణంగా పెట్టి 21 క్రూ సభ్యుల ప్రాణాలను కాపాడారని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img