Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

సీపీసీ ద్విశతాబ్ది లక్ష్యం దిశగా చైనా

శతాబ్ది ఉత్సవాల విజయానికి జిన్‌పింగ్‌ కృతజ్ఞతలు

బీజింగ్‌: సీపీసీ శతాబ్ది ఉత్సవాల విజయానికి కృషి చేసినవారికి జిన్‌పింగ్‌ కృతజ్ఞతలు తెలిపారు. వారిపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతినిధులకు నూతన తరహా మార్గదర్శకాలను సూచించారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా (సీపీసీ) శతాబ్ది ఉత్సవాల సన్నాహాల్లో పాల్గొన్న ప్రతినిధులతో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సమావేశమయ్యారు. సీపీసీ సెంట్రల్‌ కమిటీ పొలిటికల్‌ బ్యూరో స్టాండిరగ్‌ కమిటీ సభ్యులు కెకియాంగ్‌, వాంగ్‌యాంగ్‌, వాంగ్‌ హునింగ్‌, జావో లెజి, హాన్‌జెంగ్‌ హాజరయ్యారు. 14వ పంచవర్ష ప్రణాళిక(2021`2025) అమలుకు సీపీసీ ద్వి శతాబ్ది వేడుకల లక్ష్య దిశగా పయనించాలన్నారు. చైనాను గొప్ప ఆధునిక సోషలిస్టు దేశంగా నిర్మించడానికి, బలోపేతానికి, విస్తరణకు మరింతగా కృషి చేయాలని జిన్‌పింగ్‌ నొక్కిచెప్పారు. దేశ రాజకీయ చరిత్రలో ప్రధాన సంఘటన అయిన సీపీసీ శతాబ్ది ఉత్సవాలను సీపీసీ సెంట్రల్‌ కమిటీ నాయకత్వంలో పాల్గొన్న వారందరి ఉమ్మడి యత్నాలు ఫలించాయని ఆయన ప్రశంసించారు. సోషలిస్టు దేశ నిర్మాణానికి, జాతీయ పునరుజ్జీవనానికి చైనా ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. సమావేశంలో మాట్లాడిన వాంగ్‌ జి సూచనలను అధ్యయనం చేసి అమలు చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ సభ్యులు, అధికారులు, ప్రజలందరినీ వారి వారి పనుల్లో వారి అభురుచిని చర్యల రూపంలో తీసుకురావాలని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img