Friday, April 19, 2024
Friday, April 19, 2024

సుస్థిర, సుసంపన్న మధ్య ఆసియా ప్రపంచానికి అవసరం: జిన్‌పింగ్‌

జియాన్‌: సుస్థిర, సుసంపన్న, సామరస్య మధ్య ఆసియా ప్రపంచానికి ఎంతో అవసరమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ నొక్కిచెప్పారు. ఈ ప్రాంత సార్వభౌమత్వానికి, భద్రత, స్వాతంత్య్రం, ప్రాదేశిక సమగ్ర పరిరక్షణకు, అభివృద్ధికి మధ్య ఆసియా స్వతంత్రంగా ఎంపిక చేసిన మార్గాలను, చర్యలను గౌరవించాలని, శాంతి, సుస్థిరత కల్పనకు అనుసరించే విధానాలకూ మద్దతివ్వాలన్నారు. తమ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ప్రాంతాన్ని దుర్వినియోగించే హక్కు ఎవరికీ లేదని నొక్కిచెప్పారు. చైనా, మధ్య ఆసియా దేశాల సంబంధాల కొత్త యుగం అద్భుతమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అన్నారు. షాంజీ ప్రావిన్స్‌లోని జియాన్‌ నగరంలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో మాట్లాడుతూ ఇదొక మైలురాయని అన్నారు. దశాబ్ద కాలంలో తమ బంధం కొత్త యుగంలోకి ప్రవేశించిందన్నారు. యూరేసియాకు కీలకమైన కనెక్టివిటీ హబ్‌గా తయారయ్యే సామర్థ్యం మధ్య ఆసియాకు ఉన్నదని జిన్‌పింగ్‌ అన్నారు. ఇదిలావుంటే, జిన్‌పింగ్‌ బుధవారం నుంచి గురువారం వరకు మధ్య ఆసియా దేశాలైన కజకస్తాన్‌, తజికిస్తాన్‌, కిర్గిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌ దేశాల అధ్యక్షులతో వరుస భేటీ అయ్యారు. చైనాతో కలిసి పనిచేసేందుకు, ఉమ్మడి అభివృద్ధి లక్ష్యాలు సాధించుకునేందుకు, సహకారాన్ని పెంచుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు మధ్య ఆసియా దేశాధినేతలు జిన్‌పింగ్‌కు వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img