Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సూడాన్‌లో 200కు పెరిగిన మృతులు

ఖార్టూమ్‌: సూడాన్‌ ఆర్మీ, పారామిలటరీ రాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్సెస్‌ (ఆర్‌ఎస్‌పీ) మధ్య మూడ్రోజులుగా కొనసాగుతున్న ఘర్షణల్లో ఇప్పటికే 200 మంది చనిపోగా 1800 మంది గాయపడ్డారని ఆ దేశంలోని ఐరాస మిషన్‌ హెడ్‌ వోల్కర్‌ పెర్తెస్‌ తెలిపారు. తాజా పరిస్థితులతో సుడాన్‌ ఆరోగ్య వ్యవస్థ దెబ్బతిన్నదన్నారు. ఆసుపత్రులు, క్లీనిక్‌ల వద్ద భయాునక దృశ్యాలు ఆవిషృతమయ్యాయి. మృతదేహాలు, బంధువుల ఆర్తనాథాలతో ఆయా ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. ఘర్షణల కారణంగా కొన్ని ఆసుపత్రులు పూర్తిగా దెబ్బతిన్నాయి.ఇద్దరు సైన్యాధికారుల అధికార దాహం కారణంగా సూడాన్‌లో మూడు రోజులుగా హింస జరుగుతోంది.
యూరప్‌ రాయబారి నివాసంపై దాడి
సూడాన్‌ రాజధాని ఖార్టూమ్‌లోని ఐరోపా రాయబారి నివాసంపై దాడి జరిగింది. ఈ ఘటన నుంచి రాయబారి సురక్షితంగా బయటపడినట్టు తెలుస్తోంది. ఐరాస వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌కు చెందిన ముగ్గురు సిబ్బంది చనిపోయారు. దర్ఫర్‌లో ఔషదాలు, ఆహారం సరఫరా చేస్తున్న క్రమంలో ఘర్షణల్లో చిక్కుకుని వీరు ప్రాణాలు కోల్పోయారు.
మానవతా సాయం దాదాపు అసాధ్యం: ఐఎఫ్‌ఆర్‌సీ
సూడాన్‌లో నెలకొన్న హింసాత్మక పరిస్థితుల్లో ఆ దేశ ఆరోగ్య వ్యవస్థ పతనం అంచునకు చేరుకున్నదని ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ రెడ్‌ క్రాస్‌ Ê రెడ్‌ క్రెసెంట్‌ సొసైటీస్‌ (ఐఎఫ్‌ఆర్‌సీ) మంగళవారం హెచ్చరించింది. ఖార్టూమ్‌లో ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని, మానవతా సాయం అందించడం దాదాపు అసాధ్యమైందని ఐఎఫ్‌ఆర్‌సీ హెడ్‌ ఫరీద్‌ ఐవర్‌ అన్నారు. ఆయన నైరోబీ నుంచి వీడియో సమావేశంలో విలేకరులతో మాట్లాడారు. వివిధ సంఘాల వారు, ప్రజలు చిక్కుకుపోయి సాయం కోరుతున్నట్లు తెలిపారు.
కాల్పులు విరమించాలి` దాడి ఆగాలి: ఐరాస, డబ్ల్యూహెచ్‌ఓ
సుడాన్‌లో హింసను నిలిపివేయాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటర్రస్‌ పిలుపునిచ్చారు. ఈ పరిస్థితులు దేశానికి మంచిది కాదన్నారు. గుటర్రస్‌తో పాటు ప్రపంచ దేశాలు కూడా ఘర్షణ వద్దని, శాంతి నెలకొల్పాలని పిలుపునిచ్చాయి. మానవతా చట్టాలు, ఆరోగ్య హక్కు చట్టాలను ఉల్లంఘిస్తున్నారని, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై దాడులను వెంటనే ఆపివేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సూచించింది. ఇప్పటికే ఆరోగ్య సిబ్బంది ముగ్గరు చనిపోయారని, కాల్పులను తక్షణమే విరమించుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓ అధికార ప్రతినిధి మార్గరెట్‌ హారిస్‌ పిలుపునిచ్చారు. ఇది సంక్లిష్ఠ పరిస్థితి, వెంటనే దాడులను ఆపడం అనివార్యమని నొక్కిచెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img