Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సూడాన్‌ ప్రధాని అరెస్టు సైన్యం తిరుగుబాటు..!

సూడాన్‌ : అంతర్యుద్ధంతో సూడాన్‌ అట్టుడుకుతోంది. క్యాబినెట్‌ సభ్యులను సైన్యం అరెస్టు చేసింది. రాజధాని ఖార్టోమ్‌లో ప్రధాని అబ్దుల్లా హమ్‌డోక్‌, ఇతర రాజకీయ నాయకులను అరెస్టు చేసి సూడాన్‌ సైనిక నాయకుడు దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అంతర్జాతీయ విమానాశ్రయాలన్నింటిని మూసివేశారు. విమానాలను రద్దు చేసినట్లుగా ప్రకటించారు. ఇంటర్నెట్‌ సేవలను సైతం నిలిపివేశారు. దీంతో అసలు ఏం జరుగుతోందో ప్రజలకు తెలియకుండా పోయింది. తమకు అనుకూలంగా ప్రకటన చేసేందుకు నిరాకరించడంతో ప్రధాని హమ్‌డోక్‌ను సైన్యం తమ అదుపులోకి తీసుకుంది. మిలిటరీ తిరుగుబాటుకు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు వీధుల్లో నిరసన ప్రదర్శన చేపట్టడంతో వివిధ ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి. వారిని నిలువరించేందుకు సైన్యం కాల్పులు జరిపింది. చాలామంది గాయపడ్డారని రాయ్‌టర్స్‌ వార్తాపత్రిక వెల్లడిరచింది. సూడాన్‌లో ఇటీవల సైనిక, పౌర గ్రూప్‌ల మధ్య అధికారం పంపిణీ విషయంలో వివాదాలు ఏర్పడ్డాయి. దీంతో ఇరువర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో సైన్యం మరోసారి తిరుగుబాటుకు దిగింది. సైనిక అధికారి ప్రభుత్వాన్ని రద్దు చేయడాన్ని ప్రపంచ నాయకులు, మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండిరచాయి. సూడాన్‌లో నెలకొన్న సైనిక నియంతృత్వాన్ని జర్మనీ విదేశాంగ శాఖ ఖండిరచింది. ప్రధాన మంత్రి అబ్దుల్లా హమ్‌డోక్‌తో సహా పౌర నేతలను సూడాన్‌ భద్రతా బలగాలు నిర్బంధించడం ఆమోదయోగ్యం కాదని ఐక్యరాజ్య సమితి పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img