Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సోషలిజమే ప్రత్యామ్నాయం

సెప్టెంబరు 12 ర్యాలీకి టీకేపీ పిలుపు
ఇస్తాంబుల్‌ : ‘సోషలిజానికి సమయం ఆసన్నమైంది. మనిషి లాభాల కోసం ప్రకృతిని నిర్వీర్యం చేయడాన్ని సంఘటితంగా అడ్దుకుందాం. మన పనరులు కొల్లగొట్టిన దేశంలో మనం జీవించకూడదనుకుంటే ఆ దేశ ప్రజలకు విలువ ఉండవని (టీకేపీ) కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ టర్కీ సెప్టెం బరు 12 ర్యాలీకి పిలుపునిచ్చింది. ప్రజలను సంఘటిత పరచింది. ఈ నేపధ్యంలో టీకేపీ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. ఇకపై తమ దేశం బూర్జువా వర్గ దోపిడీని, నష్టాన్ని భరించడానికి ప్రజలు సిద్దంగా లేరని పేర్కొంది. దేశంలో నెలకొన్న పెట్టుబడీదారీ వ్యవస్థ కొంతమందికి మాత్రమే దేశ సంపద, కార్మికుల దోపిడీ విధానాలతో విలాసవంత జీవనాన్ని గడుపుతున్నారని కర్షకులు, కార్మికులు అత్యంత పేదరికంలో జీవిస్తున్నారని టీకేపీ పేర్కొంది. ఇప్పటికైనా ప్రజలు మేల్కొనాలని పిలుపునిచ్చింది. ప్రజలకు ఆరోగ్యం, విద్య ప్రాథమిక హక్కులను దోచుకునే బూర్జువా వర్గానికి వ్యతిరేకంగా పోరాడాలని పేర్కొంది. సమాజంలోని ఒక వర్గానికి మనుగడే కష్టమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రకృతిలో రాయి, మట్టి, నీరు, గాలి, చెట్లు, జంతు వులు అన్నీ కూడా విక్రయిస్తున్న దోపిడీ వ్యవస్థలో శ్వాసకూడా కష్టమైపోతోందని ఆవేదన చెందింది. సమాజంలో పేరుకుపోయిన అసమానతలు, అణచివేతలు, అజ్ఞానంలో మహిళలు హత్యలకు గురవుతున్నారు. వలసకార్మికులు మరింత దోపిడీకి గురవుతున్నారు. యుద్ధాలు చేయడం ధర్మాలుగా పరిగణిస్తున్నారు. మనిషి తోటి మనిషిని దోపిడీ చేయడం, మనుషుల్ని అమానవీయంగా మార్చే క్రమం కొనసాగుతోంది. టర్కీ రిపబ్లిక్‌ 100 వ వార్షికోత్సవం సందర్భంగా లౌకిక, ప్రజాతంత్ర, సోషలిస్టు వర్కర్స్‌రిపబ్లిక్‌ కోసం ఈ నెల 12న కర్తల్‌లో స్వేచ్ఛ, సమా నత్వంకోసం సంఘటితంగా పోరాడుదాం. స్వేచ్చా భవిష్యత్తుకోసం నినదిద్దాం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img