Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

స్టాలిన్‌ 70వ వర్థంతికి ఎరుపెక్కిన రెడ్‌స్క్వేర్‌

సోవియట్‌ నేతకు వేలాది మంది నివాళి
మాస్కో: విప్లవ నాయకుడు జోసఫ్‌ స్టాలిన్‌ 70వ వర్థంతి సందర్భంగా రెడ్‌స్క్వేర్‌ ఎరుపెక్కింది. వేలాది మంది ఆయనకు ఎర్రరంగు పూలగుచ్ఛాలతో నివాళులర్పించారు. శీతల ఉష్ణోగ్రతలు, వణికించే చలిని సైతం లెక్క చేయకుండా వారంతా సోవియట్‌ నేతకు పుష్పాంజలి ఘటించారు. సోవియట్‌ జెండాలు, స్టాలిన్‌ చిత్రపటాలు, పూలతో ఆయనకు నివాళులర్పించారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రజలు కదలిరావడంతో క్రెమ్లిన్‌ నెక్రోపోలిస్‌ వద్దనున్న స్టాలిన్‌ సమాధి వద్ద భారీ క్యూలైన్లు కనిపించాయి. కొన్ని దశాబ్దాలుగా కమ్యూనిస్టు`సోవియట్‌ వ్యతిరేక ప్రచారం తీవ్రస్థాయిలో జరుగుతున్నాగానీ స్టాలిన్‌కు రష్యన్‌ ప్రజలలో అభిమానం తగ్గలేదు.రష్యన్లలో స్టాలిన్‌కున్న ఆదరణ అనేక సర్వేలు లేల్చాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీలపై సోవియట్‌ గెలుపులో ఆయన ప్రముఖ పాత్రకు గుర్తింపు తమ నివేదికల్లో ధ్రువీకరించాయి. స్టాలిన్‌ వంటి నేత ఉంటే ప్రజలు సంతోషిస్తారని ఓ పింఛన్‌దారుడు అన్నారు. రష్యాకు స్టాలిన్‌ తిరిగి రాకపోతే రష్యన్లు, స్థానికుల మనుగడ కష్టసాధ్యమని 73ఏళ్ల రష్యన్‌ కల్నల్‌, మిలటరీ ఇంటెలిజెన్స్‌ అధికారి వ్లాదిమిర్‌ క్వాచ్‌కోవ్‌ అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img