Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

స్వాతంత్య్ర ర్యాలీపై తాలిబన్లు తూటాల వర్షం

ఇస్లామిక్‌ ఎమిరేట్‌గా ప్రకటన

కాబూల్‌ : అఫ్గానిస్తాన్‌ ఇకపై ఇస్లామిక్‌ ఎమిరేట్‌ అని తాలిబన్లు తాజాగా ప్రకటించారు. అఫ్గాన్‌లో 102వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకల వేళ..తాలిబన్లు ఈ ప్రకటన చేశారు. అఫ్గానిస్తాన్‌ 1919 ఆగస్టు 19న బ్రిటీష్‌ నియం త్రణ నుండి స్వాతంత్యాన్ని సంపాదించుకుంది. తాలబన్లు మళ్లీ అధికారంలోకి రావడంతో పరిస్థితులు భీతావహంగా మారాయి. 1996`2001 మధ్యకాలంలో తాలిబన్లు అధికారంలో ఉన్న కాలంలో దేశాన్ని ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ అఫ్గానిస్తాన్‌గా పిలిచేవారు. 2001లో అమెరికా దళాలు పేరులోంచి ‘ఇస్లామిక్‌ ఎమిరేట్‌’ అనే పదాన్ని తొలగించారు. మళ్లీ మునుపటిపేరు పునరుద్ధరించారు.
తాలిబన్ల నిజస్వరూపం బైటపడుతోంది. తాలిబన్‌ ఆఫ్గానిస్తాన్‌లో గురువారం స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా చేపట్టిన ర్యాలీలో జాతీయజెండాను ఎగురవేసిన వ్యక్తులపై తాలిబన్లు తూటాల వర్షం కురిపించారు. ఈ ఘటనలో అనేకమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అఫ్గానిస్తాన్‌లో ఏటా ఆగస్టు19న చేపట్టే స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రజలపై తాలిబన్లు తూటాలు పేల్చారు. అసదాదాబాద్‌లో చేపట్టిన ర్యాలీలో ప్రజలు జాతీయజెండాను చేపట్టడంతో వారిపై తాలిబన్లు కాల్పులు జరిపారు. తుపాకుల శబ్దంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. ప్రజలు పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ప్రజలు మరణించినట్లు సమాచారం. అయితే ఎంతమంది అనేది ఇంకా వెలుగులోకి రాలేదు. తమకు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ నేత విగ్రహాన్ని ధ్వంసం చేశారు. తాజా పరిణామాలతో అఫ్గాన్‌ వాసుల్లో భయాందోళనలు ఎక్కువయ్యాయి. నూతన ప్రభుత్వ ఏర్పాటుదిశగా చర్చలు కొనసాగుతున్నాయి. తూర్పు అఫ్గాన్‌ ప్రాంతం జలాలా బాద్‌లో బుధవారం ప్రజల నిరసనలను అణచివేసే ప్రయ త్నం చేపట్టారు. తాలిబన్ల జెండాను తొలగించి పౌరులు పార్లమెంటులో జాతీయ జెండాను ఎగురవేశారు. దీనితో లాఠీలతో నిరసనకారులను చితగ్గొట్డారు. అసదాదాబాద్‌ తూర్పు నగరమైన ఖోస్ట్‌లో నిరసనకారులు తాలిబన్ల తెల్ల ఇస్లామిక్‌ బ్యానర్‌ను కూల్చివేశారు. తాలిబన్‌ వ్యతరేకతను కూడగొట్టేందుకు ప్రయత్నిస్తున్న మొదటి ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేప్‌ా నిరసనలకు మద్దతు తెలిపారు.
ఆఫ్గానిస్తాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘని బుధవారం కాబూల్‌ నుంచి పారిపోవడాన్ని సమర్థించారు, రక్తపాతాన్ని నివారించడానికి ఇది ఏకైక మార్గమని వివరించారు. మిలియన్‌ డాలర్లను దొంగిలించాడని తజికిస్థాన్‌లోని తన దేశ రాయబారి వాదనలను ఖండిరచారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఉన్నానని ధృవీకరిస్తూ ఘనీ తన ఫేస్‌బుక్‌ పేజీలో ఒక వీడియోను పోస్ట్‌ చేశాడు.
దయనీయంగా అఫ్గాన్‌ వాసుల జీవితాలు
అఫ్గాన్‌ వాసుల జీవితాలు దయనీయంగా మారాయి.దేశంలో 30శాతం భూభాగం తీవ్ర కరవుకాటకాలతో నెలకొంది.కరోనా వ్యాప్తి తీవ్రం కావండం, వాక్సిన్‌ సదుపాయాలు లేకపోవడం,తాజాగా మారిన దేశ పరిస్థితులతో అఫ్గాన్‌ వాసుల పరిస్థితి దుర్బరంగా మారింది. పోలియో టీకాలను రానివ్వకుండా చేస్తున్న తాలిబన్లు కరోనా టీకాలను కూడా నిలువరిస్తారనే భయం ప్రజల్లో నెలకొంది. 50శాతం తీవ్ర కరవు ఉండగా..20శాతం భూభాగంగా మోస్తరు కరవు ఉంది. గోధుమల ఉత్పత్తిరెండు మిలియన్‌ టన్నులకు పడిపోగా..మూడు మిలియన్ల పశువులు, ఇతర జీవాలు మృత్యుముఖంలోఉన్నాయి. అఫ్గాన్‌జనాభాలో సగంమంది కటిక పేదరికంలో అల్లాడుతున్నారు. వీరిలో 11 మిలియన్ల మందికి ఆహారం కొరత ఏర్పడిరది.. మొత్తం 18లక్షల టీకాలను మాత్రమే వేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. మొత్తం నాలుగుకోట్ల జనాభా ఉంటే.. 500,000పరీక్షలు మాత్రమే నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడిరచింది.గత వారం తాలిబన్లు కొవిడ్‌ టీకాల కార్యక్రమాన్ని నిలిపివేశారు. వలసలు ఎక్కువకావడంతో కరోనా మరింత విజృంభించే అవకాశం ఉంది. ఫలితంగా పొరుగున ఉన్న పాక్‌, ఇరాన్‌ దేశాల్లో మరింతగా పెరిగే వీలుంది.
కాబూల్‌ విమానాశ్రయంలో
హృదయవిదారక దృశ్యాలు
దేశంలో ఎటుచూసినా హృదయవిదారక దృశ్యాలే..తాలిబన్ల అరాచకాలు తట్టుకోలేక ప్రజలు భయంతో పారిపోతున్నారు. తమను కాపాడాలని విదేశీ సిబ్బందిని వేడుకుంటున్నారు. తమను కాకపోయినా.. తమ పిల్లలను అయినా బతికించమని ప్రార్ధిస్తున్నారు. ఇటువంటి దశ్యాలు కాబూల్‌ ఎయిర్‌పోర్టులో దర్శనమిస్తున్నాయి. ఎయిర్‌పోర్టు గోడకు అటువైపు బ్రిటన్‌, అమెరికాలతోపాటు ఇతర దేశాల సిబ్బంది, సైన్యం ఉండగా ఇటువైపు ఆఫ్గాన్‌ మహిళలు, ప్రజలుఉన్నారు. తాలిబన్లపాలనలో మహిళలకు రక్షణ ఉండదని తమ పిల్లల్ని తీసుకెళ్లమని అఫ్గాన్‌ మహిళలు ఇతర దేశాల సైన్యాన్ని అభ్యర్థిస్తున్నారు. అయ్యా మేం తాలిబన్ల చెరలో ఉన్నాం..మాకు బతుకులేదు..మా పిల్లలు మాతో ఉంటే వారికీ చావు తప్పదు..ఆత్మాభిమానం చంపకు బతకాలి. దయచేసి తీసుకెళ్లండి అంటూ రోదిస్తున్న తీరు అత్యంత దీనంగా ఉంది. తమకు రక్షణ కల్పించాలని..లేదా దేశం దాటించాలని అమెరికన్‌ సైన్యాన్ని యువతులు వేడుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img