Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

స్వీడన్‌ ఎన్నికల్లో మధ్యేవాద మితవాద పార్టీ విజయం

కోపెన్‌హాగన్‌ : స్వీడన్‌లో జరిగిన ఎన్నికల్లో మధ్యేవాద మితవాద పార్టీ(సెంటర్‌రైట్‌) విజయం సాధించింది. దీనితో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమైంది. సెప్టెంబరు 11న జరిగిన సాధారణ ఎన్నికల్లో మధ్యేవాద మితవాద పార్టీలు 176 సీట్లు గెలుపొందగా అధికార సోషల్‌ డెమోక్రాట్‌లతో కూడిన సెంటర్‌లెఫ్ట్‌ కూటమికి 173 సీట్లు వచ్చాయి. స్వీడన్‌లో మూడవ అతి పెద్దపార్టీగా నమోదైన సెంటర్‌`రైట్‌ మోడరేట్స్‌ నాయకుడు స్వీడన్‌ డెమోక్రాట్లను పాలక సంకీర్ణంలో లేదా వెలుపల ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వమని అధికారికంగా కోరారు. 349-సీట్ల స్వీడన్‌ పార్లమెంట్‌ స్వీకర్‌ ఆండ్రియాస్‌ నార్లెన్‌, మితవాదుల నాయకుడు ఉల్ఫ్‌ క్రిస్టర్‌సన్‌ను పాలక కూటమిని ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారు. గత వారం, స్వీడన్‌ సోషల్‌ డెమోక్రటిక్‌ ప్రధాన మంత్రి మాగ్డలీనా ఆండర్సన్‌ ఎన్నికల్లో ఓడిపోయినట్లు అంగీకరించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆమె పదవిలో కొనసాగుతారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img