Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

హక్కుల కోసం నినదించిన అఫ్గాన్‌ మహిళ

కాబూల్‌: అఫ్గాన్‌లో తాలిబన్ల దురాక్రమణ అనంతరం మహిళల భద్రతగురించి ఆందోళన వ్యక్తమవుతున్న వేళ.. అఫ్గాన్‌ మహిళలు హక్కుల కోసం పెద్దఎత్తున ర్యాలీ చేపట్టారు. నూతన ప్రభుత్వంలోని కేబినెట్‌లో మహిళల రాజకీయ భాగస్వామ్యం కోసం నినదించారు. ఇరవైఏళ్ల తమ స్వేచ్ఛకు కళ్లెం వేస్తే సహించేది లేదని ఎదురు తిరిగారు. తాజా పరిస్థితుల్లో మహిళలకోసం ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే.. విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో వాటా కోసం పట్టుబడుతూ వేలమంది అఫ్గాన్‌ మహిళలు ప్రధాన పట్టణాల వీధుల్లో ర్యాలీ చేపట్టారు. తాలిబన్లకు వ్యతిరేకంగా నిరసన గళం వినిపిం చారు. మా హక్కులు మాకు కావాల్సిందే నన్నారు. అఫ్గాన్‌ పశ్చిమ ప్రాంతంలోని ఊళ్లల్లో హక్కుల పరిరక్షణకోసం మహిళలు ఉద్యమాన్ని లేవనె త్తారు.హెరాట్‌ప్రావిన్స్‌లోని గవర్నర్‌ కార్యాల యాన్ని ముట్టడిరచారు. ఇది మిగిలిన ప్రదేశాల్లో స్పూర్తి రగిలించింది. మేం అసహనంలో ఉన్నాం. అన్న ప్లకార్డులు చేపట్టారు. ఉద్యోగాల నుండి తమను తప్పించే ప్రయత్నాలను సరికాదన్నారు. ఇంట్లో స్త్రీలు పనిచేస్తేనే గడవని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈ పరిస్థితులు ఆర్థికంగా ఎన్నో కుటుంబాలను దిగజారుస్తుం దన్నారు. పరస్థితులు చేజారకముందే తమను పనులకు అనుమతించా లని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వమేదైనా ప్రజాస్వామ్యయు తంగాఅఫ్గాన్‌ను చూడాలని కోరుకుంటున్నాట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img