Friday, April 19, 2024
Friday, April 19, 2024

హెచ్‌1బీ, ఎల్‌1 వీసా సంస్కరణల బిల్లు

అమెరికా సెనేట్‌లో ప్రవేశపెట్టిన సభ్యులు డబ్లిన్‌, గ్రాస్లే
వాషింగ్టన్‌: హెచ్‌1బీ, ఎల్‌1 వీసా సంస్కరణల బిల్లును అమెరికా సెనేట్‌లో ప్రవేశపెట్టారు. ఇద్దరు సెనేటర్లు డిక్‌ డబ్లిన్‌, చక్‌ గ్రాస్లే ఈ బిల్లును సభ ఎదుట ఉంచారు. విదేశీ కార్మికుల నియామకుల్లో మరింత పారద్శకతకు హామీనిచ్చే విధంగా ద్వైపాక్షిక శాసనాన్ని తీసుకొచ్చారు. హెచ్‌1బీ, ఎల్‌1 వీసా సంస్కరణ బిల్లు ద్వారా మోసాలు తగ్గుతాయని, ఇమిగ్రేషన్‌ వ్యవస్థలో వేధింపులు ఉండవని, అమెరికా వర్కర్లకు, వీసాదారులకు రక్షణ లభిస్తుందని, విదేశీ వర్కర్ల నియామకాల్లో మరింత పారదర్శకత అవసరమవుతుందని బిల్లును ప్రవేశపెట్టినప్పుడు సెనేటర్లు చెప్పినట్లు మీడియా ప్రకటన పేర్కొంది. ఎల్‌1, హెచ్‌1బీ వర్కర్లను నియమించుకోవాలని భావించే యజమానులపై అటెస్టేషన్‌ అవసరాలు, నియామకాలు, కొత్త వేతనాలకు సంబంధించి ఆదేశాలివ్వాలని, హెచ్‌1బీ ఉద్యోగాలను కార్మికశాఖ (డీఓఎల్‌) వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని కూడా ఈ బిల్లు ప్రతిపాదించినట్లు వెల్లడిరచింది. కాగా ఈ బిల్లును 2007లో మొదటిసారి ప్రవేశపెట్టారు. 65 వేల హెచ్‌1బీ వీసాల నమోదు పూర్తి
అమెరికా ఇమ్మిగ్రేషన్‌ సేవల సమాఖ్య గణాంకాల ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరానికి పరిమితి విధించిన మేరకు 65,000 హెచ్‌1బీ వీసా దరఖాస్తులకు ఈ-రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) ఈ మేరకు ప్రకటన చేసింది. యూఎస్‌ కాంగ్రెస్‌ విధించిన పరిమితి మేర ఖరారు చేసిన 65వేల వీసాల్లో ఉపయోగించని వాటిని వచ్చే ఆర్థిక సంవత్సరానికి అర్హమైనవిగా పరిగణిస్తారు. హెచ్‌1బీ వీసాలకున్న అధిక డిమాండు దృష్ట్యా వాటి జారీ ప్రక్రియలో సంస్కరణల కోసం ఎప్పటినుంచో అభ్యర్థనలున్నాయి. వీసాల సంఖ్యను పెంచాలని, దరఖాస్తు ప్రక్రియను సులభరం చేయాలని కోరుతున్నారు. సాంకేతిక రంగంలో కొనసాగుతున్న తొలగింపుల నేపథ్యంలో హెచ్‌1బీ వీసా ఉండి,ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగులు 60 రోజుల్లోపు అమెరికా వీడాలన్నది వాస్తవం కాదని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ సేవల సమాఖ్య స్పష్టం చేసింది. ఈ మేరకు భారత ఫౌండేషన్‌, భారత వలసల అధ్యయన కేంద్రానికి యూఎస్‌సీఐఎస్‌ డైరెక్టర్‌ ఓ లేఖ రాసింది. సాంకేతిక రంగంలో అసంకల్పిత తొలగింపుల సమస్య తీవ్రత మాకు తెలుసు. బాధిత కుటుంబాల ఆర్థిక సమస్యలను అర్థం చేసుకోగలం’ అని పేర్కొంది. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అమేజాన్‌ వంటి కంపెనీలు ఈ మధ్య వరుసగా ఉద్యోగులను తొలగించాయి. గతేడాది నవంబరు నుంచి రెండు లక్షల ఐటీ ఉద్యోగులను తొలగించారు. ఇందులో 30 నుంచి 40 శాతం మేర హెచ్‌1బీ, ఎల్‌1 వీసాలు ఉన్న భారతీయ ఐటీ నిపుణులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వీరంతా నిబంధనల మేరకు 60 రోజుల్లోపు.. నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ హోదా మార్పునకు లేదా సర్దుబాటునకు దరఖాస్తు చేసుకోవాలి. ఏ దరఖాస్తు చేయనివారు మాత్రమే గడువు ముగిసిన వెంటనే అమెరికా వీడాల్సి ఉంటుందని లేఖ పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img