Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

18న బంగ్లాదేశ్‌, భారత్‌ తొలి ఆయిల్‌ పైప్‌లైన్‌

ప్రారంభించనున్న హసీనా, మోదీ
ఢాకా: బంగ్లాదేశ్‌, భారత్‌ సరిహద్దు ఆవలి తొలి ఆయిల్‌ పైప్‌లైన్‌ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఈనెల 18న పైప్‌లైన్‌ను రెండు దేశాల ప్రధానమంత్రులు షేక్‌ హసీనా, నరేంద్ర మోదీ సంయుక్తంగా ప్రారంభిస్తారు. డీజిల్‌ సరఫరా కోసం ఈ పైప్‌లైన్‌ వినియోగమవుతుందని, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇద్దరు ప్రధానులు పైప్‌లైన్‌ను ప్రారంభిస్తారని బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి డాక్టర్‌ ఏకే అబ్దుల్‌ మోమెన్‌ తెలిపారు. ఈ పైప్‌లైన్‌ నిర్మాణం పూర్తి అయిందని, భారత్‌ మనకు డీజిల్‌ పంపడం శుభ సమచారమని వెల్లడిరచారు. కాగా బాంగ్లాదేశ్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, ఢాకాకు డీజిల్‌ ఎగుమతి చేసేందుకు భారత్‌`బంగ్లాదేశ్‌ ఫ్రెండ్‌షిప్‌ పైప్‌లైన్‌ (ఐబీఎఫ్‌పీ)ను భారతీయ రుణరేఖ (లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌) నుంచి రూ.3.46 బిలియన్లతో ఏర్పాటు చేశారని అధికారిక నివేదిక వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img