Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

20న నేపాల్‌ పార్లమెంటులో విశ్వాస ఓటు

ఖాట్మండు: నేపాల్‌ ప్రధాని పుష్పకమల్‌ దహల్‌ ప్రచండ ఈనెల 20వ తేదీన పార్లమెంటులో విశ్వాస ఓటు నిర్వహించనున్నారు. ఇటీవల అధికార కూటమి నుంచి రెండవ అతిపెద్ద పార్టీ సీపీఎన్‌యూఎంఎల్‌ తమ మద్దతును ఉపసంహరించుకుంది. దీంతో బలపరీక్షకు ప్రచండ సిద్ధం కావాల్సి వచ్చింది. అధ్యక్షుడి ఎన్నిక క్రమంలో మారిన రాజకీయ సమీకరణల పర్యవసానంగా అధికార కూటమికి కొన్ని మిత్రపక్షాలు వీడ్కోలు పలికాయి. ప్రచండ`మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ మధ్య పొత్తు కూడా చెడిపోయింది. నేపాలీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రామ్‌ చంద్ర పౌడెల్‌కు ప్రచండ మద్దతివ్వడమే ఇందుకు ప్రధాన కారణమైన విషయం విదితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img