Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

2024 అధ్యక్ష రేసులో బైడెన్‌!


వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో పోటీపై ఆసక్తి కనబర్చారు. 2024లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. వయస్సు మీదపడుతున్నాగానీ పోటీపై ఆయనకున్న ఆసక్తి గురించి ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. 2020లో బైడెన్‌కు గట్టి పోటీ ఇచ్చిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గతేడాదే తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించుకున్న విషయం విదితమే. బైడెన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 2024 ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పోటీ చేయాలనే ఉందిగానీ దీనిపై నిర్ణయించుకోలేదని చెప్పారు. వయస్సు మీద పడుతున్నా అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు ‘ఇది ఆలోచన మాత్రమే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని అధ్యక్షుడు బదులివ్వడం ఆసక్తికరంగా మారింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img