Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

31న భారత్‌కు ప్రచండ


ఖాట్మండు: నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌ ప్రచండ ఈనెల 31 నుంచి నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటిస్తారు. భారత ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్‌లో పర్యటించనున్నారని నేపాల్‌ విదేశాంగ శాఖ ఒకప్రకటనలో తెలిపింది. మోదీని కలిసి ద్వైపాక్షిక సంబంధాల విస్తరణపై చర్చిస్తారని, ఇతర నాయకులతోనూ ఆయన భేటీ అవుతారని వెల్లడిరచింది. 2022 డిసెంబరులో నేపాల్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రచండ (68) భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి కాగా ఆయన గతంలో మూడుసార్లు పర్యటించారు. ప్రచండ వెంట ఆయన తనయ గంగా దహల్‌, మంత్రులు, కార్యదర్శులు, ప్రభుత్వ సీనియర్‌ అధికారులు ఉంటారు. నేపాల్‌ బృందానికి ప్రధాని మోదీ విందు ఇస్తారని ప్రకటన తెలిపింది. ప్రచండ భారత్‌కు చేరుకున్నాక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌ను మర్యాదపూర్వకంగా కలుస్తారని అధికారిక ప్రకటన పేర్కొంది. జూన్‌ 1న మోదీతో సమావేశం అనంతరం సంయుక్త విలేకరుల సమావేశాన్ని ఇద్దరు ప్రధానులు నిర్వహిస్తారని తెలిపింది. ఫెడరేషన్‌ ఆఫ్‌ నేపాలీస్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌, ఇండస్ట్రీ (ఎఫ్‌ఎన్‌సీసీఐ), కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) సంయుక్త అధ్వర్యంలో న్యూదిల్లీలో జరిగే నేపాల్‌`భారత్‌ వాణిజ్య సదస్సులో ప్రచండ పాల్గొంటారని, రెండు దేశాల వ్యాపారవేత్తలతో సంభాషిస్తారని పేర్కొంది. భారత్‌కు నేపాల్‌ రాయబారి ప్రసాద్‌ శర్మ ఏర్పాటు చేసే స్వాగతసభలో నేపాల్‌ సంతతి ప్రజలతో ప్రచండ ముచ్చటిస్తారని, ఉజ్జెయిన్‌, ఇండోర్‌నూ సందర్శిస్తారని తెలిపింది. జూన్‌ 3న ప్రచండ ఖాట్మండుకు పయనమవుతారని నేపాల్‌ విదేశాంగ శాఖ వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img