Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

క్యూబా చమురు నిల్వల్లో 40శాతం ఆవిరి

హవానా: క్యూబా దేశ ప్రధాన చమురు నిల్వల్లో 40శాతం అగ్నికి ఆహుతైంది. మతంజాస్‌ సూపర్‌ ట్యాంకర్‌ పోర్టులోని నాలుగు ట్యాంకర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. క్యూబాలోని అత్యధిక చమురు దిగుమతి చేసుకునే పోర్టు ఇదే. ఇక్కడినుంచి సరఫరా అయ్యేచమురును ప్రధానంగా విద్యుత్తు తయారీకి వినియోగిస్తారు. ఈ పోర్టులోని ట్యాంకర్‌పై పిడుగుపడడంతో మంటలు అంటుకున్నాయి. అదివారం నుంచి ఈ మంటలు మిగిలిన మూడు ట్యాంకర్లు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలను అదుపుచేసేందుకు మెక్సికో, వెనిజులా నుంచి సుమారు 100 మంది సిబ్బందిని ఈ ప్రదేశాలకు పంపినట్లు సమాచారం. మంటలు కొనసాగడతోదగ్గరకు ఎవరూ వెళ్లలేని పరిస్థితి. భారీగా కాలుష్యం వ్యాప్తి చెందడంతో ప్రజలు మాస్కులు ధరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆమ్లవర్షాలు కూడా పడే అవకాశం ఉందని వితావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు.
కేకేఈ సంఫీుభావం
క్యూబా కమ్యూనిస్ట్‌ పార్టీకి. మతంజాస్‌ కాల్పులను ఎదుర్కొన్న ప్రజలకు కేకేఈ సంఫీుభావం తెలిపింది. మతంజాస్‌లోని చమురు కర్మాగారంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం సందర్భంగా, కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ గ్రీస్‌ (కేకేఈ) అంతర్జాతీయ సంబంధాల విభాగం సంఫీుభావ సందేశాన్ని పంపింది. క్యూబా సెంట్రల్‌ కమిటీకి, ప్రభుత్వానికి, క్యూబా ప్రజలకు మాతాంజస్‌ చమురు కేంద్రాల వద్ద సంభవించిన భారీ అగ్నిప్రమాదం, విధ్వంసానికి అంతర్జాతీయ సంఫీుభావాన్ని తెలియజేసింది. అగ్నిమాపక సిబ్బందికి, సాయుధ బలగాలకు, మంటలను ఆర్పేందుకు, తప్పిపోయిన వారిని రక్షించేందుకు వీరోచితంగా పోరాడుతున్న వారందరికీ మా సంఫీుభావం తెలియజేస్తున్నాము. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని కేకేఈ పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img