Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

60 రోజులకు రష్యా ఓకే

నల్లసముద్రంలో ఆహార ధాన్యాల ఎగుమతులపై ఐరాసతో
చర్చలో అంగీకారం

జెనీవా: ఉక్రెయిన్‌తో బ్లాక్‌సీ గ్రెయిన్‌ ఇనిషియేటివ్‌ (నల్ల సముద్రం గుండా నౌకల్లో ఆహార ధాన్యాల ఎగుమతి ఒప్పందం) మరో 60 రోజులు పొడిగించేందుకు రష్యా అంగీకరిం చింది. జెనీవాలో ఐరాస ప్రతినిధులతో సమావేశం క్రమంలో ఈ మేరకు అంగీకారం తెలిపినట్లు రష్యా విదేశాంగ శాఖ సహాయ మంత్రి సెర్గీ వెర్షినిన్‌ ప్రకటించారు. వాణిజ్యం, అభివృద్ధిపై సదస్సు ఐరాస ప్రధాన కార్యదర్శి (మానవతాద వ్యవహారాలు) రెబెకా గ్రిన్స్‌పాన్‌ అధ్యక్షతన జరిగింది. ఈనెల 18తో ఈ పథకానికి రెండవ పొడిగింపు గడువు ముగియ నుంది. అయితే 60రోజుల కోసమే దానిని పొడిగిస్తామని రష్యా స్పష్టంచేసింది. ఈ ఒప్పం దం క్రమంలో 24 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాలు 1600కుపైగా రక్షిత నౌకల్లో నల్ల సముద్రం గుండా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎగుమతి అవుతున్నట్లు ఐరాస వెబ్‌సైట్‌ పేర్కొంది. ఈ ఒప్పందం కాలాన్ని పొడిగించాలని ఉక్రెయిన్‌ నేతలతో గతవారం కీవ్‌లో జరిగిన సమావేశంలోనూ ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ అన్నారు. నల్ల సముద్రం గుండా ఆహార ధన్యాల ఎగుమతికి ఐరాస కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అలాగే రష్యా ఎగుమతుల లబ్ధికి కసరత్తులు జరుగుతు న్నట్లు ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img