బీజింగ్: అల్జీరియా, కంబోడియా దేశాలతో చైనా దౌత్యబంధానికి 65ఏళ్లు అయ్యాయి. ఈ సందర్భంగా కంబోడియా రాజు నోరోడమ్ శిహామొనికి శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాన్ని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ బుధవారం పంపారు. తమ దౌత్యబంధం అనేక ఒడిదుడుకులను నిలద్రొక్కుకున్నదని, మరింత బలపడిరదన్నారు. ఉత్తమ ప్రమాణాలు, ఉన్నత స్థాయి భవిష్యత్ ప్రణాళికలతో రెండు దేశాల మధ్య ‘డైమెండ్ హెగ్జాగన్’ సహకారంతో రాజకీయాల్లో, తయారీ రంగంలో, వ్యవసాయం, ఇంధనం, భద్రత రంగాల్లో కలిసి ముందుకు సాగుదామని జిన్‌పింగ్ పేర్కొన్నారు. జిన్‌పింగ్ అంతకుముందు గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్‌లో అల్జీరియా అధ్యక్షుడు అబ్దెల్ మజీద్ టెబ్బోర్నెతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య దౌత్యం మొదలై 65 ఏళ్లు అయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సామ్రాజ్యవాదాన్ని, వలసవాదాన్ని తిప్పికొట్టేందుకు రెండు దేశాలు చేతులు కలిపాయని గుర్తుచేశారు. పరస్పర సహకారంలో, గౌరవంతో మంచి మిత్రదేహాలుగా, సహజ భాగస్వాములుగా కొనసాగినట్లు తెలిపారు. మైత్రిని, చైనాఅల్జీరియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు చైనా కట్టుబడి ఉందని జిన్‌పింగ్ చెప్పారు. ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అల్జీరియాకు సహకరించేందుకు, దిగుమతులు, వాణిజ్య సహకారాన్ని పెంపొదించేందుకు చైనా కట్టుబడి ఉందని చెప్పారు. అల్జీరియాకు మొదటిసారి చైనా వైద్య బృందాన్ని పంపి 60 ఏళ్లు అయ్యిందని, ఆరు దశాబ్దాల్లో 3,522 మంది చైనా మెడికల్ వర్కర్లు ఆ దేశానికి వెళ్లి 27 మిలియన్ల మందికి వైద్య సేవలు అందించారన్నారు. ఐరాస భద్రతా మండలిలో 2024
25లో తాత్కాలిక సభ్యత్వం పొందినందుకు అల్జీరియాకు జిన్‌పింగ్ శుభాకాంక్షలు తెలిపారు.
అల్జీరియా అధ్యక్షుడు టెబ్బోర్నె మాట్లాడుతూ చైనా తమకు మంచి మిత్రభాగస్వామి దేశమన్నారు. దశాబ్దాలుగా తమకు గణనీయమైన తోడ్పాటును అందించినందుకు కృతజ్ఞులు తెలిపారు. తైవాన్, జిన్‌జాంగ్ వంటి అంశాల్లో చైనాకు మద్దతిస్తామని చెప్పారు. చైనా గ్లోబల్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్, గ్లోబల్ సెక్యూరిటీ
గ్లోబల్ సివిలైజేషన్ ఇనిషియేటివ్‌లకూ మద్దతిస్తామన్నారు. బెల్డ్ Êరోడ్‌కు సహకరిస్తామన్నారు.