Friday, April 19, 2024
Friday, April 19, 2024

9వేల మందిని ఉద్యోగం నుంచి తొల‌గించ‌నున్న.. అమెజాన్

ప‌లు విభాగాల‌లో ప‌ని చేస్తున్న 9వేల మందిని ఉద్యోగం నుంచి తొల‌గించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది అమెజాన్ సంస్థ‌. ప్రధానంగా క్లౌడ్, ప్రకటనల విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులనే తొలగించనున్నట్లు సమాచారం. ఆర్థిక అనిశ్చితి, సంస్థ పనితీరు మెరుగుపరుచుకోవడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అమెజాన్ లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇటీవల వరుస తొలగింపులతో సంస్థలో పనిచేస్తున్న 27 వేల మందికి కంపెనీ ఉధ్వాసన పలికింది. సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో ఇలా తొలగింపునకు గురైన వారు 9 శాతం. మిగతా విభాగాల ఉద్యోగుల మాటెలా ఉన్నా క్లౌడ్, ప్రకటనల విభాగంలో పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రతకు ఢోకా ఉండదనే అభిప్రాయాలు ఉండేవి. ఈ రెండు విభాగాలు అమెజాన్ కు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. అయితే, ఆర్థిక అనిశ్చితి ఈ రెండు విభాగాలలో ఉద్యోగులను తొలగించేదాకా చేరిందని అమెజాన్ ఉద్యోగవర్గాలు తెలిపాయి. కాగా, మరోమారు ఉద్యోగుల తొలగింపు ప్రకటన చేయడంతో అమెజాన్ స్టాక్ విలువ దాదాపు 2 శాతం మేర పడిపోయింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img