Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

గాబన్‌లో సైనిక తిరుగుబాటు

లిబ్రెవిల్లె: మధ్య ఆఫ్రికా దేశమైన గాబన్‌లో సైనిక తిరుగుబాటు జరిగింది. దీంతో 55 ఏళ్ల కుటుంబ పాలనకు తెరపడిరది. తాజా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ అధ్యక్షుడు అలీ బాంగోకు పదవి దక్కలేదు. అధికారాన్ని దేశాన్ని సైన్యం హస్తగతం చేసుకుంది. అధ్యక్షుడిని గృహనిర్బంధంలో ఉంచింది. ఎన్నికల ఫలితాలను రద్దు చేసింది. దీంతో తనకు మద్దతుగా నినాదాలు, ఆందోళనలు చేయాలని దేశ ప్రజలకు అధ్యక్షుడు ఓ వీడియో సందేశమిచ్చారు. అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కానీ అందుకు భిన్నపరిస్థితులు దేశంలో కనిపించాయి. రాజధాని లిబ్రెలివ్లెలో ప్రజలు రోడ్లపైకొచ్చి జాతీయ పతాకాలు ప్రదర్శించారు. జాతీయ గీతం ఆలపిస్తూ తిరుగుబాటుదారులకు మద్దతు పలికారు. దేశ వనరులను కొల్లగొడుతూ బాంగో కుటుంబం సంపద అమాంతం పెంచుకుందని దుయ్యబట్టారు. తిరుగుబాటు చేసినందుకు సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. మా నిరీక్షణ ముగిసిందంటూ వేడుక చేసుకున్నారు. సైనిక తిరుగుబాటు కారణంగా దేశంలో పార్లమెంట్‌, రాజ్యాంగ కోర్టు, ఆర్థిక, సామాజిక, పర్యావరణ మండలి, గాబనీస్‌ సెంటర్‌ ఫర్‌ ఎలక్షన్స్‌లతో సహా అన్ని ప్రభుత్వ సంస్థలు రద్దయ్యాయి. అన్ని సరిహద్దులనూ సైన్యం మూసివేసింది. బాంగో తిరిగి ఎన్నికయ్యారని గాబన్‌ ఎన్నికల సంఘం ప్రకటించిన వెంటనే సైనిక తిరుగుబాటు జరిగినట్లు తెలుస్తోంది. అధ్యక్ష ఎన్నిక విశ్వసనీయమైనది కాదన్నది సైన్యాధికారుల వాదన. బాంగో (64) 2009 నుంచి అధికారంలో ఉన్నారు. అంతకుముందు 41ఏళ్లు ఆయన తండ్రి పరిపాలన సాగింది. బాంగో కుటుంబ పాలనపై చాలా ఏళ్లుగా ప్రజల్లో అసంతృప్తి, అసహనం పెరిగాయి. 2019లోనూ వేరొక వర్గం ద్వారా సైనిక తిరుగుబాటుకు విఫలయత్నం జరిగింది. అయితే తాజా పరిస్థితులకు బాంగో అసమర్థ పాలనే కారణమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బాంగో నిర్లక్ష్య వైఖరి, అనాలోచిత నిర్ణయాలు దేశాన్ని గందరగోళంలోకి నెట్టివేసినట్లు సైనికుల అధికార ప్రతినిధి అన్నారు. ప్రభుత్వ సంస్థలను మోసం చేసిన నేరం కింద అధ్యక్షుడి సన్నిహితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడిరచారు. తాజా పరిణామాలతో గాబన్‌ ప్రజల కష్టాలు మరింత పెరుగుతాయని విదేశీ నాయకులు, విశ్లేషకులు ఆందోళన వ్యక్తంచేశారు.
ఫ్రాన్స్‌,ఈయూ ఖండన: సైనిక తిరుగుబాటును ఫ్రాన్స్‌, యూరోపియన్‌ యూనియన్‌ ఖండిరచాయి. ఎన్నికల ఫలితాలను గౌరవించాలని ఫ్రాన్స్‌ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఓలివర్‌ వెరన్‌ పేర్కొన్నారు. గాబన్‌లో ఫ్రాన్స్‌కు ఆర్థిక, దౌత్య, సైనికపరంగా మంచి సంబంధాలు ఉన్నాయి.
సైనిక తిరుగుబాటు ఆ ప్రాంతాన్ని అస్థిరపరుస్తుందని యూరోపియన్‌ యూనియన్‌ పేర్కొంది. శాంతియుతంగా చర్యలు జరపడం ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ అన్నారు. గాబన్‌ దేశం, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా చర్యలు ఉండాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img