Monday, September 25, 2023
Monday, September 25, 2023

దేశవ్యాప్త సమ్మె

పాక్‌లో ప్రధాన మార్కెట్లన్నీ బంద్‌
పెరిగిన ఇంధన ధరలు, విద్యుత్‌ చార్జీలకు నిరసన

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్లాడుతోంది. ఆ దేశంలో నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోయాయి. రాజకీయ అనిశ్చితి, రికార్డు స్థాయి ద్రవ్యోల్బణంతో దాయాది దేశ ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజాగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎన్నడూ లేని విధంగా రూ. 300 దాటాయి. తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై రూ.14.91 పెరగడంతో ప్రస్తుతం ధర రూ.305.36కు చేరింది. హైస్పీడ్‌ డీజిల్‌ ధరను లీటర్‌ రూ.311.84కు పెరిగింది. డాలర్‌తో పోలిస్తే పాకిస్తాన్‌ రూపాయి మారక విలువ పతనమైంది. దీంతో పాక్‌ సెంట్రల్‌ బ్యాంకు వడ్డీ రేట్లను భారీగా పెంచాల్సిన పరిస్థితి నెలకొంది. పెరుగుతున్న విద్యుత్‌ బిల్లుల భారం మోయలేక పాక్‌ వాసులు శనివారం దేశవ్యాప్తంగా సమ్మె జరిగింది. ఇస్లామాబాద్‌, లాహోర్‌, కరాచీ, పెషావర్‌ మార్కెట్లు మూసివేశారు. భారీ విద్యుత్‌ బిల్లులు, ఇంధన ధరలను నియంత్రించాలని డిమాండ్‌ చేశారు. వేలాది మంది పాకిస్తానీ వర్తకులు తమ దుకాణాలను మూసివేసి స్వచ్చంధంగా సమ్మెలో పాల్గొన్నారు. అకారణంగా విద్యుత్‌ బిల్లులు, పెంచడం తగదన్న పోస్టర్లు, ప్లకార్డులను ఆందోళనకారులు ప్రదర్శించారు. భరించలేని స్థాయికి పరిస్థితి చేరుకున్న కారణంగా ప్రతి ఒక్కరు నిరసన తెలపుతున్నారు. ఆందోళనల్లో భాగస్వాములు అవుతున్నారని లాహోర్‌ టౌన్‌షిప్‌ ట్రేడర్ల యూనియన్‌ అధ్యక్షుడు అజ్మల్‌ హషీమీ వెల్లడిరచారు. రోజు కనీసం రెండు పూటల భోజనం చేసేందుకు ప్రజలకు వీలు కల్పించాలి. వారికి ఎంతో కొంత ఉపశమనాన్ని ఇవ్వాలని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img