Friday, September 22, 2023
Friday, September 22, 2023

ఫ్రాన్స్‌లో క్యూబా అనుకూల ర్యాలీ

పారిస్‌: క్యూబాలో శాంతి పరిరక్షణకు ఫ్రాన్స్‌లోని క్యూబా రాయబార కార్యాలయం, క్యూబా నివాసితులు, క్యూబాకు మద్దతిచ్చే ఫ్రెంచ్‌ ప్రజలు పెద్ద ఎత్తున ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనలో క్యూబాకు తమ సంఫీుభావాన్ని ప్రకటించారు. క్యూబా విప్లవ విజయాన్ని ప్రశంసించారు. క్యూబా శాంతికి భంగం కలిగించే అమెరికా సామ్రాజ్యవాద ప్రయత్నాలను ఖండిరచారు. క్యూబా రాయబార కార్యాలయం వద్ద, విప్లవానికి మద్దతుగా డజన్ల కొద్దీ ప్రజలు క్యూబా జెండాలు, బ్యానర్‌లతో ప్రదర్శన చేపట్టారు. క్యూబాను కూలదోయడానికి అమెరికా ప్రోత్సహించిన అల్లర్లు, హింసాత్మక చర్యలను ఖండిరచారు. యునెస్కోలోని క్యూబన్‌ రాయబారి యహిమా ఎస్క్వివెల్‌తో పాటు, దౌత్యవేత్త క్యూబాలో శాంతి ప్రయత్నాలు ప్రబలంగా ఉన్నాయని నొక్కి చెప్పారు. ప్రపంచ సవాళ్లు, ఇబ్బందులను అధిగమించడానికి క్యూబన్లందరి ఐక్యత, సహకారం అవసరమని పేర్కొన్నారు. ఫ్రాన్స్‌,క్యూబా, క్యూబా సి ఫ్రాన్స్‌ అసోసియేషన్‌ల ప్రతినిధులు, క్యూబా నివాసితుల సమన్వయకర్త హాజరైన వేడుకలో ఫ్రాన్స్‌లో క్యూబాకు సంఫీుభావం తెలిపినందుకు వైలెంట్‌ కృతజ్ఞతలు తెలిపారు. జూలై 23న ఫ్రాన్స్‌లోని రిపబ్లిక్‌ స్క్వేర్‌లో క్యూబాకు మద్దతుగా ప్రదర్శనకు పిలుపునిచ్చాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img