Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

ఇటలీలో ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సమ్మె

వందల విమాన సేవలు రద్దు
రోమ్‌: పర్యాటక సీజన్‌లో ఇటలీలో ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సమ్మె మొదలైంది. ఈ రంగానికి చెందిన కార్మిక సంఘాల పిలుపు మేరకు శనివారం గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ నుంచి సెలక్ట్‌ ఎయిర్‌లైన్‌ స్టాఫ్‌ వరకు సమ్మెకు మద్దతిచ్చారు. దీంతో దేశంలో విమాన సేవలకు తీవ్రస్థాయిలో అంతరాయం కలిగింది. ఫలితంగా కొన్ని వందల విమానాలు రద్దు అయ్యాయి. ప్రయాణికులు గంటల కొద్దీ విమానాశ్రయాల్లోనే వేచివుండాల్సిన పరిస్థితి ఏర్పడిరది. మాల్టా ఎయిర్‌తో ఒప్పందాలపై తీవ్ర అసంతృప్తితో సమ్మెకు పిలుపునిచ్చినట్లు కార్మిక సంఘాలు ఫిల్ట్‌ సిగిల్‌, యుల్ట్రాస్పోర్టీ, ఉగల్‌ ట్రాన్స్‌పోర్టో తెలిపాయి. పని ఒప్పందాలు, మెరుగైన పని పరిస్థితులు కోసం డిమాండ్‌ చేశాయి. మహమ్మారి మిగిల్చిన నష్టాల క్రమంలో పర్యాటకం పుంజుకున్న వేళ కార్మికులు సమ్మెబాట పట్టడంతో సంస్థలకు నష్టాలు తప్పడం లేదు. పైలెట్లు, ఫ్లైట్‌ అటెండెంట్లు, ఎయిర్‌పోర్టు సిబ్బంది సమ్మె వల్ల 133 విమానాలు రద్దు చేసినట్లు జాతీయ విమానయాన సంస్థ ఐటీఏ ప్రకటించింది. పదుల సంఖ్యలో విమాన సేవలను నిలిపివేసినట్లు రైయానైర్‌, వ్యూలింగ్‌ ఎయిర్‌లైన్స్‌ కూడా వెల్లడిరచాయి. ఎయిర్‌పోర్ట్‌ హ్యాండ్లింగ్‌ కంపెనీ ఉద్యోగులు, కార్మికులు, ఏవియేషన్‌, ఎయిర్‌పోర్టు వర్కర్లు, ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఉద్యోగులు, అనుబంధ కంపెనీల ఉద్యోగులు, ఫ్లైట్‌ క్రూ, మాల్టా ఎయిర్‌ టెక్నికల్‌ క్రూ సమ్మెలో పాల్గొన్నారు. ఇటీవల రైల్వే సమ్మె జరిగింది. వేసవి కాలంలోనే ఎక్కువగా రవాణా రంగంలో సమ్మెలు జరుగుతుంటాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img