Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

వెనిజులాపై అమెరికా ఆంక్షలకు చెక్‌ పెట్టాలి

మదురోకు కమ్యూనిస్టు`వర్కర్ల పార్టీల బహిరంగ లేఖ
కారకస్‌: వెనిజులాపై అమెరికా, దాని మిత్రపక్షాల ఆంక్షలు, సామ్రాజ్యవాద దురాక్రమణను వ్యతిరేకిస్తూ కమ్యూనిస్టు, వర్కర్ల పార్టీలు తాజాగా ఆ దేశాధ్యక్షుడు నికోలాస్‌ మదరోకు బహిరంగ లేఖ రాశాయి. వెనిజులా కమ్యూనిస్టు పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యాన్ని ఖండిరచాయి. అణచివేత చర్యలను నిరాధార ప్రచారాన్ని తక్షణమే ఆపేయాలని అర్మేనియా, బొహేమియా Ê మొరావియా, జర్మన్‌, గ్రీస్‌, కుదిస్తాన్‌ ఇరాక్‌, కజకస్తాన్‌, లెబనీస్‌, మెక్సికో, నెథర్లాండ్స్‌, పలస్తీనా, పారాగ్వా, సెర్బియా, స్పెయిన్‌, స్వీడెన్‌, సిరియా, టర్కీ, ఉక్రెయిన్‌ కమ్యూనిస్టు పార్టీలతో పాటు ఆస్ట్రియా లేబర్‌ పార్టీ, క్రొయేషియా సోషలిస్టు వర్కర్ల పార్టీ, ఐర్లాండ్‌ వర్కర్ల పార్టీలు డిమాండ్‌ చేశాయి. ‘వెనిజులా కమ్యూనిస్టు పార్టీ అంతర్గత వ్యవహారాల్లో రోజురోజుకు పెరిగిపోతున్న జోక్యం ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రక్రియకు మీ పార్టీ వర్గాల బహిరంగ మద్దతును గమనిస్తున్నాం. ఈ చర్యలను వ్యతిరేకిస్తూ ఇప్పటికే డజన్ల కొద్దీ పార్టీలు ఉమ్మడి ప్రకటనలు చేశాయి. తాజా బహిరంగ లేఖ ద్వారా మా వ్యతిరేకతను వ్యక్తంచేస్తున్నాం’ అని పేర్కొన్నాయి. వెనిజులా కమ్యూనిస్టు పార్టీకి, కమ్యూనిస్టు ఉద్యోమాలు, శ్రామిక హక్కుల పోరాటాలకు మద్దతు ప్రకటించాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img