Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

బ్రెజిల్‌లో ఆయుధాలపై ఆంక్షలు

బ్రెజిలియా: బ్రెజిల్‌ను ఆయుధ రహిత దేశంగా మార్చేందుకు, నేరాలను కట్టడి చేసేందుకు సామాన్యుల చేతుల్లో మారణాయుధాలు ఉండకూ డదని ఆదేశాధ్యక్షుడు లూలా డ సిల్వా నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులను జారీచేశారు. ఆయుధాన్ని కలిగివుండాలంటే అనేక షరతులు వర్తిస్తాయని తెలిపారు. ప్లానల్టో ప్యాలెస్‌లో లూటా మాట్లాడుతూ ‘ఇంట్లో తుపాకీ ఉంటే తమకు భద్రత ఉంటుందని కొందరు భావిస్తారుగానీ ప్రజల చేతుల్లో మారణాయుధాలు ఉండరాదు. ఆయుధ రహిత దేశంగా బ్రెజిల్‌ను తీర్చిదిద్దేందుకు పాటుపడదాం. భద్రతా దళాలు మాత్రమే ఆయుధాలను కలిగి ఉండాలి’ అని అన్నారు. ఈ మేరకు జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం 9 ఎంఎం., పాయింట్‌ 40 పిస్టళ్లు (ఇటీవల కాలంలో బ్రిజిల్‌ కొనుగోలు చేసిన ఆయుధాలు), పాయింట్‌ 45ఏసీపీ వంటివి భద్రతా దళాలకే పరిమితం. తుపాకీని దగ్గర పెట్టుకోవాలనుకునే సామాన్యులు అందుకు బలమైన కారణాలను చూడాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా సంవత్సరా నికి రెండు పిస్టళ్లు50 తూటాల కొనుగోలుకు లేక 4 తుపాకులు200 తూటాల కొనుగోలుకు అనుమతి లభిస్తుంది. షూటింగ్‌ క్లబ్‌ల పనివేళలు మారాయి. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు క్లబ్‌లు ఉండొచ్చుగానీ అవి విద్యాసంస్థలకు కనీసం కిలోమీటరు దూరంలో ఉండాలి. అదే సమయంలో క్లబ్‌ సభ్యులు లోడెడ్‌ గన్‌తో అక్కడకు వెళ్లేందుకు అనుమతి లేదు. క్లబ్‌కు వెళ్లే మార్గాన్ని, షూటింగ్‌ సమయాలను వారు ముందుగానే తెలియజేయాలని ఉత్తర్వులు పేర్కొన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img