Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

అసాంజెను తక్షణమే విడిపించాలి

ఆస్ట్రేలియా ప్రధానికి తొమ్మిది మంది
మాజీ అటార్నీ జనరళ్ల బహిరంగ లేఖ

సిడ్నీ: ‘వికిలీక్స్‌ వ్యవస్థాపకుడు జులియన్‌ అసాంజె నిర్బంధం ఇంకెంత కాలం? ఆయనను తక్షణమే విడిపించాలి. అమెరికా న్యాయవ్యవస్థ దయాదాక్షిణ్యానికి వదిలివేయడం సరైన పద్ధతి కాదు. ఒకవేళ అక్కడ ఆయన దోషిగా రుజువైతే జైల్లోనే చనిపోతారు’ అని తొమ్మిది మంది మాజీ అటార్నీ జనరళ్లు కలిసి ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌కు బహిరంగ లేఖ పంపారు. అసాంజెను తక్షణమే విడిచిపించాలని ఐక్యంగా డిమాండ్‌ చేశారు. వాస్తవాలను కప్పిపుచ్చేందుకు శక్తిమంత మైన దేశాలు ఏమైనా చెయ్యగలవని, స్వార్థపూరి తంగా వ్యవహరిస్తూ ఎవరికి ఎంత నష్టం కలుగు తుందో పట్టించుకోవని వ్యాఖ్యానించారు. ఓ ఆస్ట్రే లియా పౌరుడిని అపరిమిత కాలం పాటు నిర్బం ధంలో ఉంచడం అమానవీయంగా పేర్కొన్నారు. అసాంజె విషయంలో 13ఏళ్లుగా అమెరికా తాత్సా రం చేస్తోందని, ఆయనకు ఎలాంటి మినహాయిం పులు ఇచ్చే ఉద్దేశం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌కు లేదని బహిరంగ లేఖలో మాజీ అటార్నీల జనరళ్లు తెలిపారు. అసాంజెను హైటెక్‌ ఉగ్రవాదిగా బైడెన్‌ వ్యాఖ్యానించడాన్ని గుర్తుచేశారు. నాలుగేళ్లుగా బ్రిటన్‌ లోని బెల్‌మార్ష్‌ జైల్లో మగ్గుతూ అమెరికాకు అప్పగింత కోసం ఎదురుచూస్తున్న అసాంజెను విడిపించడానికి క్యాన్‌బెర్రా తగు చర్యలు తీసుకో వడం అనివార్యమని ప్రధానికి రాసిన లేఖలో కోరారు. అమెరికా దయకు వదిలేస్తే ఆయన జైల్లోనే చనిపోతారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆస్ట్రేలియా లోని లేబర్‌ ప్రభుత్వం అనేకసార్లు అసాంజె వ్యవ హారంలో గళమెత్తిందని, ఆయన కోసం మరింత కసరత్తు అవసరమని ఆస్ట్రేలియా మాజీ దౌత్యాధికారి అలిసన్‌ బ్రోనోవిస్‌క్కీ వ్యాఖ్యానించారు. ఇటీవల వాషింగ్టన్‌లో అసాంజె గురించి ప్రస్తావించినా ఫలితం లేదన్నారు. ఆస్ట్రేలియా తీరు అమెరికా సార్వభౌమాధికారానికి లొంగుబాటుకు సంకేతమని, ఇది ఆస్ట్రేలియాలోని అనేకమందికి తలవంపుగా పేర్కొన్నారు. లేఖ రాసిన వారిలో 2011 జనవరి నుంచి 2014 మార్చి వరకు టాస్మానియా ప్రధానిగా పనిచేసిన లారా గిడిరగ్స్‌ ఉన్నారు. లారా స్పందిస్తూ అసాంజె గురించి ప్రజా అభిప్రాయం ముఖ్యం కాదు. ఆయన 11 ఏళ్లుగా స్వాతంత్య్రాన్ని కోల్పోయారన్నది ప్రధానం. అసాంజె సంస్థ ద్వారా ‘లీక్స్‌’ తప్పా, ఒప్పా అన్నది పక్కకు పెడితే ఓ వ్యక్తిని ఏళ్ల తరబడి నిర్బంధంలో ఉంచడం, హక్కులను నిరాకరించడం అమానవీయం. అమెరికా న్యాయవ్యవస్థ దయకు వదిలివేయడం అనుచితం. ఒకవేళ అమెరికా కోర్టులో దోషిగా రుజువైతేగనుక అసాంజె జైల్లోనే చనిపోతారు’ అని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పౌరుడి నిరవధిక నిర్భందం ముగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బహిరంగ లేఖలో ప్రధానిని తొమ్మిది మంది మాజీ అటార్నీ జనరళ్లు డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img