Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

యుద్ధానికి సిద్ధంగా ఉండాలి

. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ పిలుపు
. సైన్యాధ్యక్షుడిగా పాక్‌ సు తొలగింపురీ యంగ్‌ నియామకం

సియోల్‌: ఉత్తర కొరియా సైన్యాధక్షుడు పాక్‌ సు2ను దేశాధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ తొలగించారు. యుద్ధం వచ్చే అవకాశం ఉందని, ఇందుకు సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. చీఫ్‌ ఆఫ్‌ ది జనరల్‌ స్టాఫ్‌ పాక్‌ సు`2 స్థానంలో వైస్‌ మార్షల్‌ రీ యంగ్‌ గిల్‌ను నియమించినట్లు కేసీఎన్‌ఏ వార్తాసంస్థ వెల్లడిరచింది. సైనిక దళాలను యుద్ధానికి సిద్ధం కావడానికి అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ సామాగ్రితో విన్యాశాలు నిర్వహించాలని కిమ్‌ పిలుపునిచ్చారని వార్తానివేదిక పేర్కొంది. కొరియన్‌ రిపబ్లిక్‌ 75వ వార్షికోత్సవం సందర్భంగా సెప్టెంబరు 9న ఉత్తర కొరియా మిలీషియా పరేడ్‌ను నిర్వహించనుంది. దీనికి ముందు ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు జరగనున్నాయి. వీటిని ఉత్తర కొరియా తమ భద్రతకు ముప్పుగా భావిస్తుండటంతో కొరియా ద్వీపకల్పంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. తాజాగా జరిపిన సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ సమావేశంలో ఆయుధ ఉత్పత్తిని పెంచుకోవాలని, మరిన్ని సైనిక విశ్యాసాలు నిర్వహించాలని కిమ్‌ పిలుపునిచ్చినట్లు మీడియా పేర్కొంది. గత వారం మూడు రోజుల పాటు ఆయుధ కర్మాగారాలను సందర్శించిన కిమ్‌ మరిన్ని క్షిపణులు, మానవరహిత గగనతల వాహనాలు, ఇతర ఆయుధాల ఉత్పత్తికి పిలుపునిచ్చారు. కేసీఎన్‌ఏ విడుదల చేసిన మ్యాప్‌ల ఫోటోల్లో కిమ్‌.. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌, దాని పరిసర ప్రాంతాలను చూపుతున్నట్లు ఉన్నాయి. రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలు అందించిందని, అందులో ఫిరంగులు, రాకెట్లు, క్షిపణులు ఉన్నాయని అమెరికా చేసిన ఆరోపణలను రష్యా, ఉత్తర కొరియా తోసిపుచ్చిన విషయం విదితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img