హవానా: లోటిన్ అమెరికన్ వార్తా సంస్థ ప్రెన్సా లాటినా 50వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం ‘‘ఫిడెల్ కాస్ట్రో, న్యూస్ట్రా సంగ్రే పోర్ వియత్నాం’’ (ఫిడెల్ కాస్ట్రో, అవర్ బ్లడ్ ఫర్ వియత్నాం) పుస్తకాన్ని విడుదల చేసింది. దక్షిణ వియత్నాంలో విముక్తి పొందిన ప్రాంతాలను సందర్శించిన మొదటి, ఏకైక ప్రపంచ నాయకుడు ఫిడెల్ కాస్ట్రో రెండుదేశాల ద్వైపాక్షిక సంబంధాలలో మైలురాయిగా నిలిచిన చారిత్రాత్మక ఘట్టాన్ని స్మరించుకోవడానికి ఈ పుస్తకావిష్కరణ వేదికగా నిలిచింది. ప్రెన్సా లాటినా ప్రెసిడెంట్ లూయిస్ ఎన్రిక్ గొంజాలెజ్ మాట్లాడుతూ, వియత్నాం న్యూస్ ఏజెన్సీ సహకారంతో ఏర్పడిన 76 పేజీల పుస్తకంలో కాస్ట్రో పర్యటన చిత్రాలు ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో, వియత్నాంలో క్యూబా రాయబారి ఫ్రెడెస్‌మాన్ టురో వియత్నాంలో క్యూబా విప్లవ నాయకుడి పర్యటన విశేషాల గురించి మాట్లాడారు. కాస్ట్రో పర్యటన వియత్నాం నాయకత్వం, జనాభాపై గొప్ప ప్రభావాన్ని చూపిందని పేర్కొన్నారు. కాస్గ్రో వియత్నాం పర్యటనతో ప్రపంచ సంఫీుభావ ఉద్యమాన్ని పెంచింది. ఈ సమావేశంలో, క్యూబాలోని వియత్నాం రాయబారి లే థాన్ తుంగ్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమాన్ని తమ దేశంలో ప్రత్యేక ప్రేమతో జరుపుకుంటారని తెలిపారు.వియత్నాం పునర్నిర్మాణానికి మద్దతు ఇచ్చినందుకు క్యూబాకు ధన్యవాదాలు తెలిపారు.