Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

కృత్రిమ మేధస్సులో చైనా అగ్రగామి

థాట్‌వర్క్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వ్యాఖ్య
టొరంటో : 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (ఏఐ)లో చైనా సూపర్‌ పవర్‌గా అవతరించనుందని గ్లోబల్‌ టెక్నాలజీ కన్సల్టెన్సీ కంపెనీ థాట్‌వర్క్స్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ ఎమెరిటా రెబెక్కా పార్సన్స్‌ పేర్కొన్నారు. ఈ నెల 28న జరిగిన కెనడాలోని టొరంటోలో జరిగిన కొలిషన్‌ కాన్ఫరెన్స్‌లో ఒక ఇంటర్వ్యూలో ఆమె పై విధంగా వ్యాఖ్యానించారు. జూన్‌ 26 నుండి 29 వరకు జరిగే ప్రపంచంలోనే అతిపెద్ద సాంకేతిక సమావేశాలలో ఒకటైన కొలిషన్‌లో జిన్‌హువాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పై విధంగా అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా, చైనా 14వ పంచవర్ష ప్రణాళిక కాలంలో (2021-2025) డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని సులభతరం చేయడానికి, సమాచార సాంకేతికతలతో దాని పారిశ్రామిక రంగాన్ని ఏకీకృతం చేయడానికి ప్రణాళికలను రూపొందించింది. 2017లో, స్టేట్‌ కౌన్సిల్‌, చైనా అభివృద్ధి కోసం ఒక ప్రణాళికను విడుదల చేసింది, కృత్రిమ మేధస్సు ఆవిష్కరణకు చైనా ప్రధాన కేంద్రంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుందని, 2030 నాటికి ఏఐ సాంకేతికత, అప్లికేషన్‌లలో ప్రపంచానికి అగ్రగామిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘చైనాలో ఇన్నోవేషన్‌, సృజనాత్మకత, రిస్క్‌ తీసుకునే స్థాయి నన్ను చాలా ఆకట్టుకుంది. ఫలితంగా చైనా నుండి వస్తున్న నూతన సాంకేతికతలో మరిన్ని ఆవిష్కరణలను చూడబోతున్నాం’’ అని పార్సన్స్‌ చెప్పారు. చైనా ఆర్థిక వ్యవస్థలో అద్భుతమైన వృద్ధితో సమస్యలలో కొన్నింటిని పరిష్కరించే సామర్థ్యం కూడా ఉంది’’ అని పార్సన్స్‌ తెలిపారు. 1993లో స్థాపించిన చికాగోలో ఉన్న థాట్‌వర్క్స్‌ 18 దేశాల్లోని 51 కార్యాలయాల్లో 11,500 కంటే ఎక్కువ మంది ఉద్యోగులతో ఉన్న ప్రముఖ టెక్నాలజీ కన్సల్టెన్సీ. సంస్థ ఆధునీకరణ, ప్లాట్‌ఫారమ్‌లు, క్లౌడ్‌, కస్టమర్‌ అనుభవం, ఉత్పత్తి, రూపకల్పన, డేటా ఏఐ, డిజిటల్‌ పరివర్తన, కార్యకలాపాల వంటి అనేక రకాల సేవలను అందిస్తుంది.
‘‘చైనా తమ బాధ్యతాయుతమైన సాంకేతికతపై పెట్టుబడిదారుల అవగాహనపై ఎక్కువ దృష్టి పెడుతుంది, అయితే ప్రపంచవ్యాప్తంగా, ప్రజలు అవగాహన గురించి మరింత విస్తృతంగా ఆలోచిస్తుందన్నారు. 118 దేశాల నుండి 36,378 మంది హాజరైన వారిని ఒకచోట చేర్చడం ద్వారా ఇప్పుడు టొరంటోలో ఐదవ సంవత్సరంలో జరిగిన ఈ సమావేశం నూతన రికార్డును చేరుకుందని నిర్వాహకులు ఒక పత్రికా ప్రకటనలో రాశారు. ఈ సమావేశానికి హాజరైన మొత్తం సభ్యులలో 41 శాతం మంది మహిళలు ఉన్నారు, అయితే ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 30 శాతం స్టార్ట్‌-అప్‌లు మహిళలు స్థాపించారున..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img